Delmicron tentiong : అమెరికాలో డెల్మిక్రాన్ టెన్షన్..! హడలెత్తిస్తున్న డబుల్ వేరియంట్..!

అగ్రరాజ్యం అమెరికా కరోనాతో అల్లాడతుంటే తాజాగా డెల్మిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. డబుల్ వేరియంట్ గా మారిన కరోనా హడలెత్తిస్తోంది.

Delmicron tentiong : అమెరికాలో డెల్మిక్రాన్ టెన్షన్..! హడలెత్తిస్తున్న డబుల్ వేరియంట్..!

Delmicron Tentiong In Foreign Countries

Delmicron tentiong : చైనాలో ఏ సమయంలో ఈ కరోనా మహమ్మారి పుట్టిందో గానీ..ఈనాటికి ప్రపంచాన్ని వణికిస్తునే ఉంది. ఒకటిపోయిదంటే మరొకటి వచ్చిపడుతోందన్నట్లుగా ఈకరోనా కొత్త కొత్త వేరియంట్లుగా జనాల్ని హడలెత్తిస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు అభివృద్ధి మాట ఎలా ఉన్నా ఈ మహమ్మారిని నియంత్రించటంలోనే బిజిబిజీగా ఉన్నాయి. ఈక్రమంలో ఇప్పటికే కరోనా డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు వణికిస్తుంటే.. ఆ రెండూ కలిసి ‘‘డెల్మిక్రాన్’’ డబుల్ వేరియంట్ గా మారి యూఎస్, యూరప్ దేశాలకు దడ పుట్టిస్తోంది. రెండు వేరియంట్ల స్పైక్ ప్రొటీన్ల మ్యుటేషన్లతో ఏర్పడిన డెల్మిక్రాన్.. చాపకింద నీళ్లలా వ్యాపిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కేసులు అమెరికా, బ్రిటన్ దేశాలలో కేసులు విపరీతంగా పెరగడానికి ఇదే కారణమని అనుమానిస్తున్నారు పరిశోధకులు.

Read more : Bitcoins : 7500 బిట్ కాయిన్లను చెత్తబుట్టలో పడేసిన భార్య..నాసా శాస్త్రవేత్తలతో వెతికిస్తున్న భర్త..

అగ్రరాజ్యం అమెరికాలో ఒక్కరోజే కొత్తగా 2 లక్షల మార్క్‌ను దాటేసాయి. మరోపక్క బ్రిటన్‌లో వరుసగా రెండోరోజూ లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ లేటెస్ట్‌ వేవ్‌ వెనుక డెల్మిక్రాన్‌ ఉండొచ్చనే వాదనను తెరపైకి తెచ్చారు పరిశోధకులు. పులిమీద పుట్రలాగా ఇదేంటిరా బాబూ అన్నట్లుగా జనాలు ఈ కొత్త కొత్త వేరియంట్లతో హడలిపోతున్నారు. ఇప్పుడు తాజాగా ఈ ‘డెల్మిక్రాన్’’ ఏంటో అర్థకావట్లేదు.

అమెరికాలో స్పష్టంగా చెప్పాలంటే 24 గంటల్లో 2 లక్షల 65,32 మంది కొవిడ్ కు గురయ్యారు. 2021 జనవరి, సెప్టెంబర్‌ తర్వాత మళ్లీ ఈ రేంజ్ లో కరోనా కేసులు నమోదు కావటంతో మరోసారి కలకలం రేపుతోంది.అంటే మరోసారి కరోనా ప్రపంచంమీద కొత్త వేరియంట్ గా విరుచుకుపడబోతోందా?అనిపిస్తోంది. అమెరికాలో ఒమిక్రాన్ బారినపడే వారి సంఖ్య కూడా 73 శాతానికి పెరిగింది. కాగా అమెరికాలో చాలామంది ఈనాటికి కూడా వ్యాక్సిన్లు వేయించుకోవటానికి ఆసక్తి చూపించకపోవటంతో అక్కడ ఈ కరోనా కొత్త కొత్త వేరియంట్లుగా మారి జనాలపై దాడి చేస్తున్నాయని కూడా నిపుణులు చెబుతున్నారు.

Read more : Omicron : ప్రపంచదేశాలపై ఒమిక్రాన్ పంజా..ఎంతమందికి సోకిందో తెలుసా ?
ఇక బ్రిటన్‌ విషయానికొస్తే..ఒక్కరోజే లక్షా 20 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. వరుసగా రెండోరోజు కూడా లక్ష పైనే కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, కెనడాల్లో కూడా కరోనా ఏమాత్రం తగ్గేదేలేదంటోంది. ఈ తాజా వేవ్‌ వెనుక డెల్మిక్రాన్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అంటే డెల్టా + ఒమిక్రాన్ కలిపి రెండు వేరియంట్లు కలిపి ఈ కొత్త వేరియంట్ గా మారిందంటున్నారు.

డెల్టా వేరియంట్‌ను, ఒమిక్రాన్‌ను కలిపి డెల్మిక్రాన్‌గా పిలుస్తున్నారు. అంటే డెల్టా + ఒమిక్రాన్=డెల్మిక్రాన్ అంటున్నారు. ఇది మరో కొత్త వేరియంట్ కాకపోయినా… డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల స్పైక్‌ ప్రొటీన్ల కలయికగా నిపుణులు చెప్తున్నారు. ఒక వ్యక్తికి ఒకే సమయంలో డెల్టాతో పాటు ఒమిక్రాన్ కూడా గురైతే దాన్ని డెల్మిక్రాన్‌గా పరిగణిస్తున్నారు. అలాగే డెల్టా నుంచి కోలుకుంటున్న వ్యక్తికి .. ఒమిక్రాన్‌ సోకితే డెల్మిక్రాన్‌ ఇన్ఫెక్షన్‌గా చెబుతారు. ఇది చాలా అరుదుగా జరగొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఒకటి కంటే ఎక్కువ కరోనా వైరస్ వేరియంట్ల బారినపడిన వారికి దగ్గరగా వెళ్లిన వారిలో ఇటువంటి విచిత్ర పరిస్థితి తలెత్తవచ్చని చెబుతున్నారు.

Read more : Vijayawada Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై సీజేఐ దంపతులు…దుర్గమ్మ దర్శనం

డెల్టా, ఒమిక్రాన్ బారినపడిన వ్యక్తుల్లో డెల్మిక్రాన్ కాస్త అటూ ఇటుగా జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి వంటి ఒకే రకమైన లక్షణాలు ఉంటున్నాయి. డెల్టా కంటే ఒమిక్రాన్‌ వ్యాధి తీవ్రత తక్కువగానే ఉండటంతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య, మరణాలు చాలా తక్కువగానే ఉండటం కాస్త ఊరట కలిగించే విషయం. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమంటే..రోగనిరోధక శక్తి లేకపోవడం, వృద్ధాప్యం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి… డబుల్ ఇన్ఫెక్షన్‌ వల్ల ప్రమాదం ఉండొచ్చని చెబుతున్నారు. కాబట్టి ఏది ఏమైనా ముందస్తు జాగ్రత్తగా ప్రతీ ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించటం మంచిదని పదే పదే చెబుతున్నారు నిపుణులు. అలా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వైరస్ వ్యాప్తిని కట్టడి చేయొచ్చని సూచిస్తున్నారు. కాబట్టి కరోనా అయినా..డెల్టా వేరియంట్ అయినా..ఒమిక్రాన్ అయినా ఇప్పుడు ‘డెల్మిక్రాన్’అయినా జాగ్రత్తలతోనే నివారించుకోవాలి. అలాగే వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అసవరం కూడా చాలా ఉంది.