Omicron : ప్రపంచదేశాలపై ఒమిక్రాన్ పంజా..ఎంతమందికి సోకిందో తెలుసా ?

కొత్తరకం కేసులు ఒకటి నుంచి 3 రోజుల్లో రెట్టింపయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. అందుకు తగ్గట్టే ప్రతి ఒక్కరూ కోవిడ్‌ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ...

Omicron : ప్రపంచదేశాలపై ఒమిక్రాన్ పంజా..ఎంతమందికి సోకిందో తెలుసా ?

Omicron World

World Wide Omicron : కరోనా కొత్తవేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలపై పంజా విసురుతోంది. 108 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. ఇప్పటివరకు సుమారు లక్షన్నర మందికి ఈ వేరియంట్ సోకినట్లు అంచనా వేస్తున్నారు. అందులో ఒక్క యూకేలోనే 90 వేల కేసులున్నాయి. డెన్మార్క్‌లో మరో 30 వేలమంది దీని బారినపడ్డారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌తో 26మంది చనిపోయారు.

Read More : Vijayawada Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై సీజేఐ దంపతులు…దుర్గమ్మ దర్శనం

భారత్‌లోనూ ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు దేశంలో 358 మంది ఈ వేరియంట్‌ బారినపడినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్‌ వ్యాపించినట్టు తెలిపింది. ప్రస్తుతం దేశంలో డెల్టా వేరియంట్‌ కేసులే ఎక్కువగా ఉన్నప్పటికీ… ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందే లక్షణాన్ని కలిగి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

Read More : TRS Vs BJP : ఎవరికీ బెదరం..టీఆర్ఎస్ కంచుకోట లాంటిది – హరీష్ రావు

ఇదే విషయాన్ని ఈనెల 7న WHO వెల్లడించినట్టు గుర్తు చేసింది. ఈ కొత్తరకం కేసులు ఒకటి నుంచి 3 రోజుల్లో రెట్టింపయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. అందుకు తగ్గట్టే ప్రతి ఒక్కరూ కోవిడ్‌ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ. ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం స్పీడ్‌గా నడుస్తోంది. ఇప్పటి వరకు 89శాతం మంది మొదటి డోసును తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. అలాగే 61శాతం మంది రెండో డోసు వేయించుకున్నట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో 140 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయినట్టు తెలిపింది.