Harish Rao : ఎవరికీ బెదరం..టీఆర్ఎస్ కంచుకోట లాంటిది – హరీష్ రావు

ప్రజల తరపున పోరాడుతున్నామని చెప్పుకునే వారు.. ఇలాంటి అనైతిక చర్యలకు దిగడం ఏంటని మండిపడుతున్నారు. దీనిపై పలువురు నేతలు స్పందిస్తున్నారు...

Harish Rao : ఎవరికీ బెదరం..టీఆర్ఎస్ కంచుకోట లాంటిది – హరీష్ రావు

Harish Rao

Telangana Minister Harish Rao : యూ ట్యూబ్ క్యూ న్యూస్ ఛానల్ నిర్వహించిన పబ్లిక్‌ పోల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి కేటీఆర్ కుమారుడిని ఉద్దేశించి ఆ ఛానల్ నిర్వహించిన పబ్లిక్‌పోల్‌పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. రాజకీయాల్లోకి నేతల కుటుంబాలను, వ్యక్తిగత విషయాలను తీసుకురావడం సరైనది కాదంటున్నారు. ప్రజల తరపున పోరాడుతున్నామని చెప్పుకునే వారు.. ఇలాంటి అనైతిక చర్యలకు దిగడం ఏంటని మండిపడుతున్నారు. దీనిపై పలువురు నేతలు స్పందిస్తున్నారు.

Read More : Nepals PM visit Bharath : భారత పర్యటనకు నేపాల్ కొత్త ప్రధాని..ఇరు దేశాల మధ్యా మళ్లీ స్నేహం బలపడేనా?

తాజాగా..మంత్రి హరీష్ రావు స్పందించారు. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. కుటుంబాలను లాగడం, వారిని కించపరచడం, హానికరమైన సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వారి సోషల్ మీడియా యంత్రాంగాన్ని ప్రోత్సహించడం బీజేపీకి తెలిసిన వ్యూహమన్నారు. ఇలాంటి వాటితో టీఆర్ఎస్ ను అడ్డుకోగలమని వాళ్ళు అనుకుంటే పొరబాటే.. ఎందుకంటే ఎవరికీ టీఆర్ఎస్ బెదరదన్నారు. పార్టీ కంచుకోటలాంటిదని గుర్తు చేయాలనుకుంటున్నట్లు పోస్టులో తెలిపారు.

Read More : AAP TELANGANA : ఆమ్ ఆద్మీ పార్టీలోకి ఇందిరా శోభన్

మరోవైపు…దీనిపై ఈ పబ్లిక్‌ పోల్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక తల్లిగా, ఓ రాజకీయ నాయకురాలిగా.. పిల్లలను పాలిటిక్స్‌లోకి లాగడాన్ని ఖండిస్తున్నానని షర్మిల ట్వీట్ చేశారు. కుటుంబ సభ్యులను ఉద్దేశించి.. కించపరిచే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మహిళలు, పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు.. రాజకీయాలకు అతీతంగా అందరూ ఖండించాలని కోరారు.

Read More : Bombay HC : మంచంమీద పడుకున్న మహిళ పాదాలు తాకినా ఆమె గౌరవాన్ని, మర్యాదను కించపరిచినట్లే : హైకోర్టు వ్యాఖ్యలు

మంత్రి కేటీఆర్‌కు.. ఆయన సోదరి, ఎమ్మెల్సీ కవిత మద్దతుగా నిలిచారు. మిమ్మల్ని విమర్శించడానికి ఎలాంటి కారణాలు లేనప్పుడు వారు మీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారని మీకు తెలుసు అని.. కేటీఆర్‌కు ధైర్యం చెప్పారు. బాధ్యతాయుతంగా ఉండడానికి ఉపయోగించాల్సిన సోషల్ మీడియాను కొందరు ద్వేషం వెళ్లగక్కడానికి, అబద్ధాలు ప్రచారం చేయడానికి ఉపయోగిస్తుండడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.