AAP TELANGANA : ఆమ్ ఆద్మీ పార్టీలోకి ఇందిరా శోభన్

పార్టీ విస్తరణ కోసం ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తి నేతలకు గాలం వేస్తున్నారు. ఈ క్రమంలో...ఇటీవలే వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీకి రాజీనామా చేసిన ఇందిరా శోభన్ ఆమ్ ఆద్మీ పార్టీ కండువా...

AAP TELANGANA : ఆమ్ ఆద్మీ పార్టీలోకి ఇందిరా శోభన్

Aap

Indira Shoban: చిన్న రాష్ట్రాలపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఫోకస్ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో అధికారం కైవసం చేసుకున్న ఆప్…ఇప్పుడు పక్క రాష్ట్రాలపై ఫోకస్ పెడుతోంది. అధికారంలో ఉన్న పార్టీలకు చెక్ పెట్టే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ పర్యటిస్తున్నారు. పంజాబ్ ఎన్నికల్లో గెలిచి..అధికారంలోకి రావాలని పావులు కదుపుతోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో పార్టీ విస్తరణపై ఆప్ నేతలు దృష్టి సారించారు. పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, గోవాతో పాటు తాజాగా..తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని భావిస్తున్నారు.

Read More : New Smartphone: అదిరిపోయే ఫీచర్స్ తో బడ్జెట్ ఫోన్: టెక్నో స్పార్క్ 8

పార్టీ విస్తరణ కోసం ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తి నేతలకు గాలం వేస్తున్నారు. ఈ క్రమంలో…ఇటీవలే వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీకి రాజీనామా చేసిన ఇందిరా శోభన్ ఆమ్ ఆద్మీ పార్టీ కండువా కప్పుకున్నారు. గతంలో కాంగ్రెస్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో పని చేశారు. ఆప్ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి సమక్షంలో ఇందిరా శోభన్ ఆప్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం ఉందనే కారణంగా..ఇందిరా శోభన్ ఆ పార్టీ గుడ్ బై చెప్పి షర్మిల వెంట వెళ్లారు.

Read More : Addanki Dayakar : కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ హీరోగా ‘పాన్ ఇండియా మూవీ’

ఆ తర్వాత కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ పగ్గాలను రేవంత్ రెడ్డికి అప్పచెప్పింది అధిష్టానం. తెలంగాణలో బలపడాలే ఉద్దేశ్యంతో కార్యచరణను రూపొందిస్తూ..ముందుకెళుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఈక్రమంలో…పార్టీలోకి తిరిగి రావాలని ఇందిరా శోభన్ యోచిస్తున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అనూహ్యంగా..ఆప్ పార్టీలో చేరడం గమనార్హం.