పెళ్లి జరుగుతుండగా ఘోర ప్రమాదం : గోల్నాకలో ఫంక్షన్ హాల్ గోడ కూలి నలుగురు మృతి

హైదరాబాద్ లోని గోల్నాకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ గోడ కూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.

  • Published By: veegamteam ,Published On : November 10, 2019 / 10:24 AM IST
పెళ్లి జరుగుతుండగా ఘోర ప్రమాదం : గోల్నాకలో ఫంక్షన్ హాల్ గోడ కూలి నలుగురు మృతి

హైదరాబాద్ లోని గోల్నాకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ గోడ కూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.

హైదరాబాద్ లోని గోల్నాకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ గోడ కూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అంబర్ పేట పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, డిజాస్టర్ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

పెరల్ గార్డెన్ లో పెళ్లి జరుగుతోంది. అదే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గోడ కూలిన ఘటనలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రెండు ఆటోలు శిథిలాల కింద ధ్వంసమయ్యాయి. 10 టూ వీలర్ లు నుజ్జునుజ్జు అయ్యాయి. పోలీసులు, జీహెచ్ఎంసీ టీమ్, డిజాస్టర్ టీమ్ ప్రమాద స్థలికి చేరుకున్నాయి.

గాయపడిన వారిని మలక్ పేటలోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈస్ట్ జోన్ జాయింట్ పోలీస్ కమిషనర్ రమేష్ తోపాటు మరికొంతమంది పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.