100 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి.. పోలీసులకు చిక్కాడు.. మహా ముదురు!

ఇప్పుడతడు ఢిల్లీ పోలీసులు అదుపులో ఉన్నాడు. అతడిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో తెలిస్తే అవాక్కవాల్సిందే.

100 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి.. పోలీసులకు చిక్కాడు.. మహా ముదురు!

Updated On : May 14, 2024 / 1:01 PM IST

Delhi Police: గత సంవత్సరం అతడు 200 విమానాలు ఎక్కాడు. 100 రోజుల పాటు విమానాల్లో దేశంలో వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇప్పుడతడు ఢిల్లీ పోలీసులు అదుపులో ఉన్నాడు. అతడిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో తెలిస్తే అవాక్కవాల్సిందే. ఢిల్లీలోని పహర్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన రాజేశ్ కపూర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఢిల్లీ పహర్‌గంజ్‌లో రాజేష్‌కి ‘రికీ డీలక్స్’ అనే గెస్ట్ హౌస్ ఉంది. ఇందులో మూడో అంతస్తులో అతడు నివసిస్తున్నాడు. మనీ ఎక్స్ఛంజ్ బిజినెస్‌తో పాటు ఢిల్లీలో మొబైల్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు.

అయితే విమాన ప్రయాణికుల నుంచి లక్షల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలు కొట్టేశాడన్న ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. విమానాల్లో ప్రయాణించే మహిళలు, వృద్ధులును ట్రాప్ చేసి చోరీ చేయడంలో మనోడు మహా ముదురని పోలీసులు తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్, అమృత్‌సర్ విమానాశ్రయాల్లోని కొన్ని గంటల సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేసిన తర్వాత రాజేష్ కపూర్‌ను పట్టుకున్నట్టు వెల్లడించారు.

కనెక్టింగ్ ఫ్లైట్స్‌లో ప్రయాణించేవారే టార్గెట్..
ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఉషా రంగరాణి తెలిపిన వివరాల ప్రకారం.. కనెక్టింగ్ ఫ్లైట్స్‌లో ప్రయాణించే వారిని టార్గెట్ చేసి చోరీలు చేసేవాడు. ప్రయాణికులతో మాటలు కలిపి వారికి సాయం చేస్తున్నట్టు నటించి నగలు, విలువైన వస్తువులు దోచేసేవాడు. ఏప్రిల్‌లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ మహిళ ఐజిఐ విమానాశ్రయం నుంచి యూఎస్‌కి కనెక్టింగ్ ఎయిర్ ఇండియా విమానం ఎక్కే సమయంలో ఆమె బ్యాగు నుంచి రూ. 7 లక్షల విలువైన నగలు కాజేశాడు. ఇదే విధంగా వర్జిందర్‌జిత్ సింగ్‌ అనే అమెరికా వాసిని కూడా దోచుకున్నాడు. అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వచ్చి కనెక్టింగ్ ఫ్లైట్‌లో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళుతున్న వర్జిందర్‌జిత్ సింగ్‌ క్యాబిన్ బ్యాగ్ నుండి రూ. 20 లక్షల విలువైన వస్తువులు దొంగిలించాడు.

Also Read: దారుణాతి దారుణం.. రాక్షసుడిగా మారిన ఉన్మాది

ఎలా కొట్టేస్తాడంటే..
వృద్ధులు, మహిళా ప్రయాణీకులను రాజేశ్ కపూర్ లక్ష్యంగా ఎంచుకుంటాడు. వారి బిహేవియన్‌ను బాగా పరిశీలించి, ఫాలో అవుతాడు. బ్యాగేజీ డిక్లరేషన్ స్లిప్‌లోని సమాచారాన్ని దొంగచాటుగా చూసి అందులో ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటాడు. బోర్డింగ్ గేట్ దగ్గర వారితో మాటలు కలుపుతాడు. విమానంలో వారి పక్కకే తన సీటు మార్పించుకుంటాడు. వారి లగేజీ సర్దడానికి సాయం చేస్తున్నట్టు నటించి.. సమయం చూసి అక్కడి నుంచి జారుకుంటాడు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు టికెట్ బుకింగ్ సమయంలో అతడు నకిలీ ఫోన్ నంబర్‌ ఇచ్చాడని పోలీసులు గుర్తించారు.

Also Read: హైవేపై సడన్ యూటర్న్.. ఆరుగురి ప్రాణాలు తీసింది