OTT Release: ఓటీటీలో ఈ వారం రిలీజయ్యే సినిమాలివే
ఒకవైపు థియేటర్లలో భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నా OTTలో మాత్రం గ్రాండ్ కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. OTTలలో విడుదల అవుతున్న సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి ..
OTT Release: ఒకవైపు థియేటర్లలో భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నా OTTలో మాత్రం గ్రాండ్ కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. OTTలలో విడుదల అవుతున్న సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండడంతో అందుకు తగ్గట్టుగానే OTT సంస్థలు ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో దూసుకొస్తున్నాయి. ఈ వారంలో కూడా OTTలో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు రిలీజవుతున్నాయి.
OTT Series: క్రైమ్ క్రేజ్.. ఓటీటీల్లో విశ్వరూపం చూపిస్తున్న హీరోయిన్లు!
సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ‘డీజే టిల్లు’ సినిమా ప్రముఖ ఓటీటీ ‘AHA’లో మార్చి 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. విశాల్ కథానాయకుడిగా శరవణన్ దర్శకత్వంలో తాజా చిత్రం ‘సామాన్యుడు’ మార్చి 1వ తేదీ నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. గ్రైన్స్ ద ఐస్(హాలీవుడ్) మార్చి 2వ తేదీ, ద వీకెండ్ ఎ వే (హాలీవుడ్) మార్చి 3వ తేదీ నుంచి, పీసెస్ ఆఫ్ హర్ (ఒరిజినల్ సిరీస్)మార్చి 4వ తేదీ నుంచి Netflixలో స్ట్రీమింగ్ కానున్నాయి.
Aha OTT: తమిళంలో కూడా ఆహా.. గ్రాండ్గా లాంచింగ్!
నో టైమ్ టు డై (హాలీవుడ్) మార్చి 4వ తేదీ నుంచి Amazon Prime Videoలో స్ట్రీమింగ్ కానుంది. అన్ దేఖీ (హిందీ సిరీస్) మార్చి 4వ తేదీ నుంచి SonyLIVలో స్ట్రీమింగ్ కానుంది. వాండర్లస్ట్ (హిందీ సిరీస్) మార్చి 4వ తేదీ నుంచి MX Playerలో స్ట్రీమింగ్ కానుంది. రుద్ర ద ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్ (హిందీ సిరీస్) మార్చి 4వ తేదీ నుంచి, సుత్ లియాన్ (హిందీ సిరీస్) మార్చి 4వ తేదీ నుంచి Disney-HotStarలో స్ట్రీమింగ్ కానున్నాయి.