Jamun : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే నేరేడు పండ్లు

నేరేడుపండులోని ఆస్ట్రింజెంట్ గుణం చర్మంపై ఏర్పడే మొటిమల సమస్యను తగ్గించడంలో సహయపడుతుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం, రక్తంలోని టాక్సిన్స్ తో పోరాడటానికి సహాయపడతాయి.

Jamun : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే నేరేడు పండ్లు

Jamun

Jamun : వేసవి ఎండల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. అంతేకాకుండా మరీ ముఖ్యంగా తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. సమ్మర్ లో అనేక రకాల పండ్లు విరివిగా మార్కెట్లో లభిస్తుంటాయి. అలాంటి వాటిల్లో నేరేడు పండు కూడా ఒకటి. వేసవి కాలంలో ఈ నేరుడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తియ్యగా, పుల్లగా, వగరుగా ఉండే నేరేడు పండులో విటమిన్ బి, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఫాస్పరస్, ప్రొటీన్ష్ ఇలా అనేక రకాల పోషకాలు ఉన్నాయి.

వేసవి కాలంలో డీహైడ్రేషన్ సమస్య అందరిలో కనిపిస్తుంది. శరీరం త్వరగా డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే నేరేడు పండ్లు తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నేరేడు పండులో ఉన్న వాటర్ కంటెంట్ శరీరం త్వరగా డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతుంది. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని మెరుగుపరచడంలో సహయపడతాయి. ఒక రకంగా చెప్పాలంటే రక్తాన్ని శుద్ధి చేసే ఏజెంట్‌గా పనిచేస్తుంది. రక్తంలో చక్కెరను తగ్గించడమే కాకుండా.. ఇన్సులిన్ నిరోధకతకు వ్యతిరేకమైన సెన్సిటివిటీని పెంచుతుంది. వాటిలోని సహజ ఆమ్లాలు బ్యాక్టీరియాతో పోరాడటానికి, నోటి పరిశుభ్రతకు చిగుళ్ళు, దంతాలకు ప్రయోజనం కలగిస్తాయి.

నేరేడుపండులోని ఆస్ట్రింజెంట్ గుణం చర్మంపై ఏర్పడే మొటిమల సమస్యను తగ్గించడంలో సహయపడుతుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం, రక్తంలోని టాక్సిన్స్ తో పోరాడటానికి సహాయపడతాయి. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. వేసవిలో ఎండ వేడి కారణంగా త్వరగా అలసి పోవటం, నీరసం వంటివి చోటు చేసుకుంటాయి. అయితే నేరెడు పండ్లు తినటం వల్ల అలసట, నీరసం వంటివి తొలగిపోతాయి. శరీరానికి శక్తినిస్తాయి. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉన్నందున అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు దరిచేరవు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కడుపు నొప్పి, కీళ్లనొప్పులకు నేరేడు పండు బాగా ఉపయోగపడుతుంది. తరుచు మూత్ర విసర్జన వంటి సమస్యలను నివారించటంలో నేరేడును ఉపయోగిస్తారు.

నేరేడు పండ్లు తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. తక్కువ మొత్తంలో ఫ్రక్టోజ్ ఉంటుంది. సుక్రోజ్ పూర్తిగా లేకపోవటం వల్ల డయాబెటిస్ తో బాధపడుతున్న వారు నేరేడు పండ్లను తీసుకోవచ్చు. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నవారు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించటంలో సహాయపడుతుంది. మలబద్దకం, ప్రేగు రుగ్మతలు, విరేచనాలు వంటి సమస్యలను నివారిస్తుంది. బహిష్టు సమయంలో మహిళలు పెద్ద మొత్తంలో రక్తం కోల్పోవాల్సి వస్తుంది. అలాంటి వారు నేరేడు పండ్లు తీసుకోవటం వల్ల తిరిగి రక్తం స్ధాయిలను పెంచుకోవచ్చు.

అయితే నేరెడు పండ్లు రుచిగా ఉన్నాయి కదా అని అధిక మోతాదులో తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదు. వీటి వల్ల కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. హైబీపీ ఉన్న వారికి ఈ పండ్లు మంచివే అయినప్పటికీ అధిక మోతాదులో తీసుకుంటే మాత్రం లో బీపీ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. నేరేడు పండును ఎక్కవగా తినటం వల్ల మలబద్దకం సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. మోతాదుకు మించి తింటే చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కొన్ని సందర్భాల్లో వాంతులు, వికారం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.