Fake Ads Warning : ఆన్‌లైన్ టికెట్ రిఫండ్ స్కామ్‌తో జాగ్రత్త.. యూజర్లకు ఐఆర్‌సీటీసీ అలర్ట్.. ఈ ఫేక్ యాడ్స్ క్లిక్ చేయొద్దు!

Fake Ads Warning : వినియోగదారులు తమ వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారాన్ని అడిగే ఫేక్ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లకు రీడైరెక్ట్ అయ్యే లింకులను క్లిక్ చేయొద్దని హెచ్చరిస్తోంది.

Fake Ads Warning : ఆన్‌లైన్ టికెట్ రిఫండ్ స్కామ్‌తో జాగ్రత్త.. యూజర్లకు ఐఆర్‌సీటీసీ అలర్ట్.. ఈ ఫేక్ యాడ్స్ క్లిక్ చేయొద్దు!

IRCTC Alerts Users About Online Ticket Refund Scam ( Image Source : Google )

Fake Ads Warning : ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుకింగ్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ టికెట్ రిఫండ్ స్కామ్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో వినియోగదారులను ఐఆర్‌సీటీ అప్రమత్తం చేస్తోంది. ఫేక్ ఆన్‌లైన్ టిక్కెట్ రీఫండ్ స్కామ్‌ల కారణంగా చాలా మంది వినియోగదారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Read Also : Top Smartphone Deals : అమెజాన్‌లో రూ. 20వేల లోపు ధరకే టాప్ స్మార్ట్ ఫోన్ డీల్స్.. లిమిటెడ్ ఆఫర్..!

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ అనే నెపంతో రహస్య సమాచారాన్ని దొంగిలించే ఈ ఫేక్ యాడ్స్ గురించి ఐఆర్‌సీటీసీ హెచ్చరించింది. వినియోగదారులు తమ వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారాన్ని అడిగే ఫేక్ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లకు రీడైరెక్ట్ అయ్యే లింకులను క్లిక్ చేయొద్దని హెచ్చరిస్తోంది. అంతేకాదు.. ఈ లింకుల ద్వారా సైబర్ నేరగాళ్లు గూగుల్‌లో టిక్కెట్ రీఫండ్‌ల వంటివి సెర్చ్ ద్వారా వినియోగదారులను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

గూగుల్ సెర్చ్ ఫ్రాడ్ వెబ్‌సైట్‌ల సమస్య చాలా ఏళ్లుగా ఉంది. ఈ ముప్పును ఎదుర్కోవడం కంపెనీకి కష్టంగా మారింది. ఐఆర్‌సీటీసీ సమస్య తీవ్రతను గ్రహించింది. ఇటీవల సోషల్ హ్యాండిల్స్ ద్వారా ఈ హెచ్చరికను వినియోగదారులకు షేర్ చేసింది. “ఇలాంటి స్కామ్‌ల బారిన పడకుండా ఉండేందుకు సోషల్ మీడియా లేదా సెర్చ్ ఇంజన్ల ద్వారా ఐఆర్‌సీటీసీ కస్టమర్ కేర్ నంబర్‌ల కోసం చూడవద్దు’’ అని ఐఆర్‌సీటీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

సాధారణంగా ఐఆర్‌సీటీసీని లక్షలాది మంది ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. అయితే, మీ రైలు రద్దు అయ్యే అవకాశం ఉన్నట్లయితే లేదా మీరు ప్రయాణ తేదీని మార్చవలసి వస్తే.. ప్లాట్‌ఫారమ్ మిమ్మల్ని టికెట్ రిఫండ్ తీసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ ప్రక్రియ కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్/యాప్ ద్వారా సంప్రదించడానికి అనుమతిస్తుంది. మీరు వారి అధికారిక సపోర్టు నంబర్‌కు ఇమెయిల్ చేయవచ్చు లేదా కాల్ చేయవచ్చు.

టిక్కెట్ రీఫండ్‌ల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక సంప్రదింపు వివరాలివే :
ఐఆర్‌సీటీసీ సెక్యూరిటీ మెమోలో టిక్కెట్ రీఫండ్‌లను పొందడానికి రైల్వే ఏజెన్సీని సంప్రదించడానికి సురక్షిత మార్గంగా ఉన్న ముఖ్యమైన వివరాలను షేర్ చేసింది.

– #IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో మమ్మల్ని సంప్రదించండి.
– care@irctc.co.inలో మాకు ఇమెయిల్ చేయండి
అధికారిక సపోర్టు కోసం 14646కు కాల్ చేయండి
మీరు తదుపరిసారి రైలు టిక్కెట్ రీఫండ్ కోసం ఐఆర్‌సీటీసీ ద్వారా అభ్యర్థించాలనుకుంటే ఈ ఛానెల్‌లను మాత్రమే ఉపయోగించాలి.

Read Also : Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఐక్యూ నియో 9ప్రోపై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?