తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ.. రేసులో RRR

అన్నీ అనుకున్నట్లు జరిగితే RRR లో ఒకరు తెలంగాణ బీజేపీ బాస్ గా పగ్గాలు చేపట్టడం ఖాయం అని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ.. రేసులో RRR

Updated On : July 21, 2024 / 9:37 PM IST

Who Is Telangana BJP Chief : తెలంగాణ బీజేపీ బాస్ పై ఢిల్లీలో తీవ్ర కసరత్తు జరుగుతోంది. మొత్తం 5 మంది తెలంగాణ బీజేపీ చీఫ్ రేసులో ఉన్నప్పటికీ.. ముఖ్యంగా RRR ఈ రేసులో లీడ్ లో ఉన్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించాల్సి రావడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. దీంతో తెలంగాణ కమల దళపతిగా ఎవరిని నియమిస్తారనే అంశంపై బీజేపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ పదవి కోసం చాలామంది నేతలు పోటీ పడుతున్నారు.

రేసు మాత్రం ఆ ముగ్గురి మధ్య మాత్రమే ఉందన్న టాక్ వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే RRR లో ఒకరు తెలంగాణ బీజేపీ బాస్ గా పగ్గాలు చేపట్టడం ఖాయం అని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. RRR లో ఒకరైన మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కి తెలంగాణ బీజేపీ పగ్గాలు దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. సీఎం అభ్యర్థిగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటలను పార్టీ ఫోకస్ చేసింది.

Also Read : హరీశ్‌ రావును ఒంటరిని చేసేలా పక్కా వ్యూహం.. గులాబీ పార్టీని ఖాళీ చేసే లక్ష్యంతో కాంగ్రెస్‌ పావులు?