Cattle : పాడి పశువుల్లో గర్భాశయ సమస్యలు, నివారణ చర్యలు

అపరిశుభ్రమైన పరిసరాలలలో పశువులు ఈనినప్పుడు , తగు జాగ్రత్తలు పాటించకపోవటం , మాయ సకాలంలో పడకపోవడం వల్ల గర్భాశయ వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ వ్యాధుల వల్ల చూడి నిలవదు.

Cattle : పాడి పశువుల్లో గర్భాశయ సమస్యలు, నివారణ చర్యలు

Buffalo

Cattle : పాడిపశువులు ఆలస్యంగా ఎదకు రావటం, ఈనిన తరువాత సకాలంలో కట్టకపోవటం వంటి సమస్యలను రైతులు తరచూ ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని పశువుల్లో ఎద లక్షణాలు బలహీనంగా ఉండి పైకి కనిపించవు. ఈ సమస్య పాలిచ్చే గేదెలలో అధికంగా ఉంటుంది. ఆహారంలో లోపం వలన అండాశయం సక్రమంగా వృద్ధి చెందక పశువులు సకాలంలో ఎదకు రావు. దీర్ఘకాలిక వ్యాధుల వలన కూడా పశువులు సకాలంలో ఎదకు రావు. పశువులకు అందించే మేతలో తగినన్ని ఖనిజలవణాలు లేకపోవటం , విటమిన్ ఎ లోపం వల్ల కూడా ఎద లక్షణాలు బలహీనంగా ఉంటాయి.

పశువులు సకాలంలో ఎదకు రావాలంటే 10 మాసాల వయస్సు నుండి రోజుకు 50 గ్రాముల ఖనిజలవణ మిశ్రమం ఇవ్వాలి. పశువులకు సంపూర్ణ సమీకృత ఆహారం అందించడం ద్వారా సమస్యను నివారించ వచ్చు. కొన్ని పశువులు సకాలంలో ఎదకు వచ్చినా రెండు మూడు సార్లు గర్భధారణ చేసినా చూలు కట్టవు. తిరిగి మరలా మరలా ఎదకు వస్తూనే ఉంటాయి. దీనినే రిపీట్ బ్రీడింగ్ అంటారు. పశువు గర్భాశంలో సూక్ష్మ జీవులు ప్రవేశించనప్పుడు సకాలంలో గర్భాధారణ చేయించనప్పుడు, వీర్యం నాణ్యత సరిగా లేనప్పుడు ఇలా జరుగుతుంది. సమస్యను గుర్తించి వెంటనే పశువైద్యుని సంప్రదించాల్సిన అవసరం ఉంది.

అపరిశుభ్రమైన పరిసరాలలలో పశువులు ఈనినప్పుడు , తగు జాగ్రత్తలు పాటించకపోవటం , మాయ సకాలంలో పడకపోవడం వల్ల గర్భాశయ వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ వ్యాధుల వల్ల చూడి నిలవదు. నిలబడినా కొద్ది రోజుల్లోనే గర్భస్రావం జరుగుతుంది. గర్భాశయ వ్యాధులలలో పాడిపశువు మానం నుండి చీము కారటం. ఇలాంటి వాటిని గుర్తించిన వెంటనే పశువైద్యులను సంప్రదించాలి. మరికొన్ని పశువులలో అండాశయ లోపాల కారణంగా గ్రంధులు సక్రమంగా పనిచేయక పోవడం వల్ల ఎదకు రావు. గర్భాశయంలో నీటిబుడ్డలు ఏర్పడిన సందర్భంలో ఎదకు వచ్చినట్లు ప్రవర్తిస్తాయి. పశువు యోని ద్వారం లోపాల వల్ల కూడా పునరుత్పత్తి సమస్యలు వస్తాయి. ఇలాంటి పశువులు పునరుత్పత్తికి పనికి రావు. అలాంటి వాటిని సకాలంలో గుర్తించి ఇతర పశువుల నుండి వేరుపరచాలి.

రెండు సంవత్సరాల వయస్సు దాటిన సంకరజాతి పెయ్యలు, మూడు సంవత్సరాలు దాటిన దేశవాళి పడ్డలు చూలు కట్టకుండా అంతే ఉంటే పశువైద్యులను సంప్రదించి తగిన చికిత్స చేయించటం మంచిది. రోజు ఉదయం , సాయంత్రం వేళల్లో పశువుల ఎదలక్షణాలను గుర్తించి సకాలంలో గర్భధారణ చేయించాలి. పశువులకు పుష్టికరమైన పచ్చిమేత అందించాలి. దాణాలో మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలు తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. పశువులు ఉండే పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వేసవిలో చల్లని వాతావరణాన్ని పశువులకు కల్పిస్తే త్వరగా ఎదకు వస్తాయి.