Mahesh Babu: ఆ బ్యూటీకి మహేష్ ఓకే చెబుతాడా..?
‘సర్కారు వారి పాట’ సినిమాతో మహేష్ బాబు ఇటీవల బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించగా, ఈ చిత్రంలో మహేష్....
Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ సినిమాతో మహేష్ బాబు ఇటీవల బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించగా, ఈ చిత్రంలో మహేష్ సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఇక పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా వచ్చిన ‘సర్కారు వారి పాట’ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది. ఈ సినిమా ఏకంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి మరోసారి మహేష్ స్టామినా ఏమిటో చూపించింది.
Mahesh Babu: ‘మురారి బావ’కు టైమ్ ఫిక్స్ చేసిన మహేష్..?
ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ నటించడంతో ఈ జోడీ అభిమానులకు బాగా నచ్చిందని అంటున్నారు. అయితే మహేష్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రం కోసం రెడీ అవుతున్నాడట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి త్రివిక్రమ్‌కు హీరోయిన్ల సెలెక్షన్ పెద్ద తలనొప్పిగా మారిందట. ఇప్పటికే ఫేంలో ఉన్న హీరోయిన్లు అందరూ మహేష్ సరసన నటించేశారు. దీంతో ఈసారి మహేష్ కోసం ఎవరిని తీసుకురావాలా అని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడట.
Mahesh Babu: మహేష్ తండ్రిగా కన్నడ స్టార్ హీరో.. ఎవరంటే?
అయితే ఈ క్రమంలోనే అందాల భామ ప్రియాంక ఆరుల్ మోహన్‌ను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకురావాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఈ వార్త సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఛాన్స్ అమ్మడికి నిజంగా బంపరాఫర్ అనే చెప్పాలి. కానీ.. పెద్దగా సక్సెస్ ట్రాక్ లేని ఈ బ్యూటీని మహేష్ ఓకే చేస్తాడా.. లేక వేరే హీరోయిన్ కోసం తన వేట కంటిన్యూ చేస్తాడా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ప్రియాంక ఆరుల్ తెలుగులో నాని నటించిన జెంటిల్మెన్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయినా, పెద్దగా గుర్తింపును మాత్రం తెచ్చుకోలేకపోయింది. ఏదేమైనా మహేష్ సరసన ఈ అమ్మడు ఆఫర్ కొట్టేస్తే మాత్రం అది తన కెరీర్‌కే టర్నింగ్ పాయింట్ అవుతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు.