Mahesh Babu: ‘మురారి బావ’కు టైమ్ ఫిక్స్ చేసిన మహేష్..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్...

Mahesh Babu: ‘మురారి బావ’కు టైమ్ ఫిక్స్ చేసిన మహేష్..?

Mahesh Babu Locks Date For Murari Baava Song From Svp

Updated On : May 30, 2022 / 9:58 PM IST

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించగా, పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. కాగా ఈ సినిమాకు థమన్ సంగీతం మేజర్ అసెట్‌గా మారింది.

Mahesh Babu: మహేష్ తండ్రిగా కన్నడ స్టార్ హీరో.. ఎవరంటే?

అయితే ఈ సినిమాలో తొలుత ఓ అదిరిపోయే మాస్ సాంగ్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ.. కొన్ని కారణాల వల్ల అది కాకుండా ఫైనల్‌గా ‘మ.. మ.. మహేశా..’ అనే పాటను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. అంతకు ముందు ‘మురారి బావ’ అనే సాంగ్‌ను రికార్డ్ చేశాడట థమన్. అయితే ఈ పాటను సినిమా విడుదల తరువాత ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. కానీ.. ఇప్పటివరకు ఈ పాట ఊసే లేకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. అయితే తాజాగా ఈ పాటను రిలీజ్ చేసేందుకు మహేష్ ముహూర్తం పెట్టినట్లుగా తెలుస్తోంది.

Mahesh Babu: ఆ సంగతి మర్చిపోయిన మహేష్.. గుర్తుచేస్తున్న ఫ్యాన్స్!

‘మురారి బావ’ సాంగ్‌ను సినిమా థియేటర్లలో మే 31 నుంచి ప్రదర్శించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను సినిమాలో యాడ్ చేయాలని మహేష్ అండ్ టీమ్ భావిస్తున్నారట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.