Monkeypox: స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి మరో మంకీపాక్స్ కేసు

దక్షిణాఫ్రికాలో మూడో వ్యక్తికి మంకీపాక్స్ వచ్చినట్లు గుర్తించారు. స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన 42ఏళ్ల టూరిస్ట్ కు వైరస్ లక్షణాలు ఉన్నట్లు లింపోపో ప్రాంతంలోని హెల్త్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.

Monkeypox: స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి మరో మంకీపాక్స్ కేసు

Monkeypox

 

 

Monkeypox: దక్షిణాఫ్రికాలో మూడో వ్యక్తికి మంకీపాక్స్ వచ్చినట్లు గుర్తించారు. స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన 42ఏళ్ల టూరిస్ట్ కు వైరస్ లక్షణాలు ఉన్నట్లు లింపోపో ప్రాంతంలోని హెల్త్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ర్యాషెస్, కండరాల నొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపించాయని, అతనికి సోకిన ఇన్పెక్షన్ మంకీపాక్స్ గా కన్ఫామ్ చేసినట్లు దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ వెల్లడించింది.

ఇప్పటికే అతను ముగ్గురిని కలిసినట్లు గుర్తించారు. వారిలో ఎటువంటి లక్షణాలు కనిపించలేదని లింపోపో హెల్త్ అఫీషియల్ ఫొఫీ రమాతుబా స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. ఇంతకుముందే ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేకపోయిన వారికి కూడా మంకీపాక్స్ కేసులు సోకినట్లుగా రికార్డులు వెల్లడించాయి.

మంకీపాక్స్ అనేది ఒక వైరల్ జబ్బు. చర్మ సంబంధిత లక్షణాలు కనిపిస్తాయి. ఆఫ్రికా ప్రాంతంల్లో కనిపించగా.. దక్షిణాఫ్రికాలో ఇప్పుడిప్పుడే కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 50దేశాలకు పైగా 7వేల 600మందికి సోకినట్లు తెలుస్తుంది.

Read Also : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు