Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు

వీరంతా లైంగిక సమస్యలతో వస్తున్న వారిలోనే వీటి లక్షణాలు ఉన్నట్టు చెప్తున్నారు. లైంగిక సంపర్క సంబంధ వ్యాధులు వ్యాపించే మంకీపాక్స్ కేసులకు కూడా అదనంగా భవిష్యత్తులో సెక్సువల్ హెల్త్ క్లినిక్‌లు చికిత్స చేయాల్సి ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.

Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు

Monkeypox

monkeypox symptoms : బ్రిటన్‌లోని మంకీపాక్స్ రోగుల్లో వేరే లక్షణాలు కనిపిస్తున్నాయని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. లండన్ లోని సెక్సువల్ హెల్త్ క్లినిక్స్‌లో అడ్మిట్ అయిన 54 మంది రోగులను ఈ ఏడాది మే నెలలో 12 రోజుల వ్యవధిలో అధ్యయనం చేయగా… వారిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి.

ఈ గ్రూపు రోగుల్లో ఇదివరకటి రోగులకు భిన్నంగా జననేంద్రియాలు, ఆసనాల వద్ద పుండ్లు వంటివి ఎక్కువగా ఉండడం, అలసట, జ్వరం తక్కువగా ఉండడాన్ని పరిశోధకులు కనుగొన్నారు. జననేంద్రియాలపై పుండ్లు వంటివి ఎక్కువగా కనిపించడాన్ని మంకిపాక్స్ లక్షణాలుగా గుర్తించారు. ప్రస్తుతం బ్రిటన్ సహా పలు దేశాల్లో క్లినిక్‌కు చికిత్స కోసం వస్తున్న పలువురిలో మంకిపాక్స్ లక్షణాలు కనిపిస్తున్నాయి.

Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తికి ప్రధాన కారణమేంటో చెప్పిన డబ్ల్యూహెచ్ఓ.. మీరూ పాటించండి..

వీరంతా లైంగిక సమస్యలతో వస్తున్న వారిలోనే వీటి లక్షణాలు ఉన్నట్టు చెప్తున్నారు. లైంగిక సంపర్క సంబంధ వ్యాధులు వ్యాపించే మంకీపాక్స్ కేసులకు కూడా అదనంగా భవిష్యత్తులో సెక్సువల్ హెల్త్ క్లినిక్‌లు చికిత్స చేయాల్సి ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఇలాంటి కేసులను పరిశీలించి వైద్య చికిత్స అందించడానికి అదనపు వనరులు అవసరమవుతాయని సూచించారు.