Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తికి ప్రధాన కారణమేంటో చెప్పిన డబ్ల్యూహెచ్ఓ.. మీరూ పాటించండి..

మంకీపాక్స్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచంలోని 29దేశాల్లో ఈ వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అత్యధికంగా వ్యాపించే ఆఫ్రికా దేశాలతో పాటు ఇతర దేశాల్లో దాదాపు వెయ్యి కేసులు బయటపడినట్లు డబ్ల్యూహెచ్ఓ నివేదికలు తెలిపాయి.

Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తికి ప్రధాన కారణమేంటో చెప్పిన డబ్ల్యూహెచ్ఓ.. మీరూ పాటించండి..

Monkeypox

Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచంలోని 29దేశాల్లో ఈ వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అత్యధికంగా వ్యాపించే ఆఫ్రికా దేశాలతో పాటు ఇతర దేశాల్లో దాదాపు వెయ్యి కేసులు బయటపడినట్లు డబ్ల్యూహెచ్ఓ నివేదికలు తెలిపాయి. గతంలో మునుపెన్నడూ ఈ వైరస్ లేని దేశాల్లో సైతం ఇప్పుడు మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే మంకీపాక్స్ వల్ల మృతిచెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ వైరస్ వల్ల ఆఫ్రికాలో 66 మంది మృతి చెందారు. అయితే మంకీఫాక్స్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆయా దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

Monkeypox Virus: వణికిస్తున్న మంకీపాక్స్.. 27దేశాల్లో వైరస్ వ్యాప్తి .. భారత్‌లో..

మంకీపాక్స్ వ్యాప్తి తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని భావించినప్పటికీ అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. అయితే మంకీపాక్స్ వైరస్ ఎక్కువగా ఏ రూపంలో వ్యాప్తి చెందుతుందో వెల్లడించారు. మంకీపాక్స్ అధికంగా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం శృంగారమే అని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ వెల్లడించారు. మంకీపాక్స్ వైరస్ సోకిన వారు ఇతరులతో శారీరకంగా కలవడం వల్ల వ్యాప్తి అధికంగా ఉంటుందని అన్నారు. అయితే ఈ వైరస్ నుంచి తమను తాము కాపాడుకోవటంతో పాటు ఇతరులను రక్షించేందుకు ఉత్తమ మార్గాలున్నాయని టెడ్రోస్ సూచించారు.

Bull arrested: ఎద్దును అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎలాంటి శిక్ష విధించారంటే..

మంకీపాక్స్ సోకినట్లు తేలితే హోం ఐసోలేషన్ లో ఉండాలి. ఇతరులకు దూరంగా ఉండాలి, ఆపై వైద్యులను సంప్రదించి కావాల్సిన చికిత్స తీసుకోవాలి. మంకీపాక్స్ చికిత్స కోసం యాంటీవైరల్, వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్నాయి. కానీ సరఫరా పరిమితంగా ఉంది. అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఆ టీకాలు వైరస్ కు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉత్తమ ఫలితాలున్నాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ తెలిపారు. అయితే మంకీపాక్స్ నివారణకు సామూహిక వ్యాక్సినేషన్ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.