Bull arrested: ఎద్దును అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎలాంటి శిక్ష విధించారంటే..

పోలీసులు ఎద్దును అరెస్టు చేశారు. పన్నెండేళ్ల బాలుడిపై దాడి చేసినందుకు ఎద్దును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అరెస్టు చేసిన ఎద్దును స్టేషన్ లో కట్టేసి ఉంచారు. ఈ విచిత్ర అరెస్టు దక్షిణ సూడాన్ లో జరిగింది. అవుతో పాటు ఆవు యాజమానిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Bull arrested: ఎద్దును అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎలాంటి శిక్ష విధించారంటే..

Bull

Bull arrested: పోలీసులు ఎద్దును అరెస్టు చేశారు. పన్నెండేళ్ల బాలుడిపై దాడి చేసినందుకు ఎద్దును అరెస్టు చేసినట్లు తెలిపారు. అయితే అరెస్టు చేసిన ఎద్దును స్టేషన్ లో కట్టేసి ఉంచారు. ఈ విచిత్ర అరెస్టు దక్షిణ సూడాన్ లో జరిగింది. అవుతో పాటు ఆవు యాజమానిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడి చట్టాల ప్రకారం ఎద్దుకు జైలు శిక్ష విధిస్తారు. జైలు శిక్ష ముగిసిన తర్వాత దాన్ని బాధితుల కుటుంబానికి అప్పగిస్తారు.

Elon Musk: యూట్యూబ్‌ కొనుగోలుకు మస్క్ సిద్ధమవుతున్నాడా? వరుస ట్వీట్లకు కారణం అదేనా..

దక్షిణ సూడాన్ లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక పొలం దగ్గర బండి లాగుతున్న ఎద్దు ఉన్నట్లుండి 12ఏళ్ల పిల్లాడిపైకి దూసుకెళ్లింది. అందరూ చూస్తుండగానే దాని కొమ్ములతో పలు దఫాలుగా దాడిచేయడంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూంబేక్ సెంట్రల్ కౌంటీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఎద్దును అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం అంత్యక్రియల కోసం బాలుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Chandrababu Tour : వస్తున్నా మీకోసం.. వైసీపీని ఎదుర్కొనేందుకు చంద్రబాబు పక్కా ప్లాన్

పోలీసులు ఎద్దుతో పాటు యాజమానిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్కడి చట్టాల ప్రకారం ఎద్దుకు జైలు శిక్ష విధించి, యాజమానికి జరిమానా విధించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇదే ప్రాంతంలో గత నెల క్రితం ఒక పొట్టేలు 45 ఏళ్ల మహిళపై దాడిచేసింది. దీంతో మహిళ మృతిచెందింది. పోలీసులు పొట్టేలును అరెస్టు చేశారు. అయితే ఆ పొట్టేలును సైనిక శిబిరంలో కఠినమైన శ్రమ విధించబడింది. అక్కడ దానిని మూడు సంవత్సరాలు జైలులో ఉంచుతారని స్థానిక పోలీసులు తెలిపారు. విడుదలైన తర్వాత దేశ చట్టాలు, సంప్రదాయాలకు అనుగుణంగా బాధిత కుటుంబానికి అందజేస్తారని, అదే తరహాలో ఆవుకు కూడా శిక్ష పడుతుందని స్థానిక పోలీసులు తెలిపారు.