Elon Musk: యూట్యూబ్‌ కొనుగోలుకు మస్క్ సిద్ధమవుతున్నాడా? వరుస ట్వీట్లకు కారణం అదేనా..

టెస్లా సీఈవో ఎలన్ మస్క్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ట్విటర్‌లో గత కొన్ని నెలలుగా మస్క్ హల్‌చల్ చేస్తున్నాడు. మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. చివరి క్షణంలో ఆ డీల్ నిలిచిపోయింది.

Elon Musk: యూట్యూబ్‌ కొనుగోలుకు మస్క్ సిద్ధమవుతున్నాడా? వరుస ట్వీట్లకు కారణం అదేనా..

Musk

Elon Musk: టెస్లా సీఈవో ఎలన్ మస్క్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ట్విటర్‌లో గత కొన్ని నెలలుగా మస్క్ హల్‌చల్ చేస్తున్నాడు. మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. చివరి క్షణంలో ఆ డీల్ నిలిచిపోయింది. ట్విటర్‌ను కొనుగోలు చేసేకంటే ముందు మస్క్ ట్విటర్‌పై విమర్శల దాడికి దిగారు. క్రమక్రమంగా ట్విటర్‌ను కొనుగోలు చేసే స్థాయికి చేరుకున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఎలన్ మస్క్ దృష్టి యూట్యూబ్‌పై పడినట్లు చర్చ జరుగుతుంది. దీనికి కారణం లేకపోయలేదు. మస్క్ వరుస ట్వీట్లతో యూట్యూబ్ పై విమర్శలు చేశారు. యూట్యూబ్ స్కామ్ యాడ్స్‌తో నిండిపోయిందని అంటూనే యూట్యూబ్‌లో స్కామ్ ప్రకటనలు ఉన్నాయనే విషయాన్ని నొక్కి చెప్పడం కోసం అతను ఒకటికాదు రెండు సార్లు వరుసగా ట్వీట్లు చేశాడు. దీంతో నెటిజన్లు సైతం మస్క్ ఇక యూట్యూబ్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Elon Musk: అలా చేయకుంటే డీల్ రద్దు చేసుకుంటా.. ట్విట్టర్‌కు ఎలన్ మస్క్ వార్నింగ్

మస్క్ సోషల్ మీడియా సైట్ ట్విటర్ ను కొనుగోలు చేసేందుకు ముందు ట్విటర్ వేదికగా విమర్శల పర్వానికి దిగారు. వరుస ట్వీట్లు చేస్తూ హల్ చల్ చేశాడు. చివరికి ట్విటర్ ను చేజిక్కించుకొనే వరకు వచ్చాడు. ప్రస్తుతం ట్విటర్ కొనుగోలు ప్రక్రియ వాయిదా పడటంతో ఇక మస్క్ దృష్టి ఆన్ లైన్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫాం యూట్యూబ్ పై పడినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. మంగళవారం మస్క్ ట్విటర్ లో వరుసగా రెండు ట్వీట్లు చేశారు. యూట్యూబ్ స్కామ్ యాడ్స్‌తో నిండిపోయిందని అందులో పేర్కొన్నారు. యూట్యూబ్‌లో స్కామ్ ప్రకటనలు ఉన్నాయనే విషయాన్ని నొక్కి చెప్పడం కోసం అతను వరుసగా రెండు ట్వీట్లు చేశాడు.

Elon Musk: ఎలన్ మస్క్ పాలసీ నచ్చక మైక్రోసాఫ్ట్, అమెజాన్ వైపు చూస్తున్న టెస్లా ఉద్యోగులు

దీంతో నెటిజన్లు మస్క్ చూపు యూట్యూబ్ పై పడిదంటూ ట్రోల్ చేస్తున్నారు. కొందరు మాత్రం మస్క్ ను జోక్ గా తీసుకోవద్దు.. ఆయన తదుపరి లక్ష్యం యూట్యూబ్ అంటూ రీ ట్వీట్లు చేస్తున్నారు. మరికొందరు మస్క్.. మీరు యూట్యూబ్‌ను కొనుగోలు చేయండి అటూ సూచిస్తున్నారు. మస్క్ ట్వీట్లను బేస్ చేసుకొని ట్విటర్‌లో “యూట్యూబ్‌ని కొనండి” అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో కొనసాగుతుండటం గమనార్హం. అయితే మస్క్ ట్వీట్ల పై సెర్చ్ దిగ్గజం ఇంకా స్పందించలేదు. మరి మస్క్ ట్విటర్ యాజమాన్యంతో డీల్ వదిలేసి యూట్యూబ్ ను కొనుగోలు చేస్తాడా? మస్క్ ట్వీట్ల వెనుక ఆంతర్యం ఏమిటి అనేది తేలాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.