Elon Musk: ఎలన్ మస్క్ పాలసీ నచ్చక మైక్రోసాఫ్ట్, అమెజాన్ వైపు చూస్తున్న టెస్లా ఉద్యోగులు

కొన్నేళ్ల పాటు కొనసాగిన వర్క్ ఫ్రమ్ హోంకు చరమగీతం పాడుతూ ఇక ఆఫీసులకు రీ ఎంట్రీ ఇవ్వాల్సిందేనని ఎలన్ మస్క్ గత నెలలో టెస్లా ఉద్యోగులకు ఈ మెయిల్ పంపారు. ఆఫీసులకు రండి.. లేదంటే మానేయండని అందులో పేర్కొన్నారు.

Elon Musk: ఎలన్ మస్క్ పాలసీ నచ్చక మైక్రోసాఫ్ట్, అమెజాన్ వైపు చూస్తున్న టెస్లా ఉద్యోగులు

Elon Musk

Elon Musk: కొన్నేళ్ల పాటు కొనసాగిన వర్క్ ఫ్రమ్ హోంకు చరమగీతం పాడుతూ ఇక ఆఫీసులకు రీ ఎంట్రీ ఇవ్వాల్సిందేనని ఎలన్ మస్క్ గత నెలలో టెస్లా ఉద్యోగులకు ఈ మెయిల్ పంపారు. ఆఫీసులకు రండి.. లేదంటే మానేయండని అందులో పేర్కొన్నారు. దీనిని అవకాశంగా తీసుకున్న మైక్రోసాఫ్ట్, అమెజాన్ టెస్లా ఉద్యోగులను లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ మెయిల్ లో ఆఫీసులకు వెంటనే అటెండ్ అవ్వాలని మరొక ఆప్షన్ లేదని టెస్లా ఉద్యోగులకు గట్టిగానే చెప్పారు మస్క్. వెంటనే ఆఫీసులకు రావాలని కచ్చితంగా వారానికి 40గంటల పాటు ఉండాలని ఆదేశించారు. అలా పలు కంపెనీలు తమ కంపెనీల్లో జాయిన్ అయి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వినియోగించుకోవచ్చని టెస్లా ఉద్యోగులకు ఆఫర్లు ఇస్తున్నాయి.

Amazon వెబ్ సర్వీసెస్ (AWS)లోని టెక్నికల్ రిక్రూటింగ్ లీడర్, జాఫర్ చౌదరి, లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేస్తూ.. AWSకి టెస్లా ఉద్యోగులను ఆహ్వానిస్తున్నాం “మస్క్ మీకు నో చెప్తే.. మిమ్మల్ని #AWSకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం” అని పోస్ట్ పేర్కొంది. (పోస్ట్ ఇప్పుడు తొలగించారు)

Read Also: టెస్లాలో పది శాతం ఉద్యోగాల కోత అవసరం: ఎలన్ మస్క్

“ప్రపంచంలోని ఎలన్ మస్క్‌ లాంటి వాళ్లతో పనిచేయడం మీకు ఇష్టం లేకుంటే, #AWSIdentityకి రండి!” అన్నారు చౌదరి. “మిమ్మల్ని, మీ సమయాన్ని, మీ వృత్తిని గౌరవించే సంతోషకరమైన ప్రదేశం ఇది. మిమ్మల్ని గౌరవంగా చూసే బృందాన్ని మీకు అందిస్తాం” అని చౌదరి వెల్లడించారు.

గతేడాది నుంచి అమెజాన్ ఉద్యోగులను నిరవధికంగా ఇంటి నుండి పని చేయడానికి అనుమతిస్తోంది. అమెజాన్ ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నంత కాలం తమ ఇళ్లలో సౌకర్యవంతంగా పని చేయొచ్చని దీని అర్థం.

మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీని అందించే మరో కంపెనీ. మైక్రోసాఫ్ట్ వ్యూహం అమెజాన్ వ్యూహానికి కొద్దిగా భిన్నంగా ఉంది. టెక్ దిగ్గజం తమ ఉద్యోగులు 50 శాతం సమయం రిమోట్‌గా ఇంటి నుండి పని చేస్తారని గతంలోనే ప్రకటించింది.