Covid: నేటి నుంచి 75 రోజుల పాటు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు

దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతోన్న వేళ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు వేయడానికి కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. దేశంలోని అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసును ఉచితంగా వేయ‌డానికి 75 రోజుల పాటు ఈ ప్రత్యేక డ్రైవ్ కొన‌సాగుతుంది.

Covid: నేటి నుంచి 75 రోజుల పాటు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు

Covid 19 Vaccine

Covid: దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతోన్న వేళ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు వేయడానికి కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. దేశంలోని అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసును ఉచితంగా వేయ‌డానికి 75 రోజుల పాటు ఈ ప్రత్యేక డ్రైవ్ కొన‌సాగుతుంది. కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించిన‌ ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌లో భాగంగా ఈ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగ‌నుంది. సాధార‌ణంగా రెండో డోసు తీసుకున్న ఆరు నెల‌ల త‌ర్వాత శ‌రీరంలో యాంటీ బాడీల స్థాయులు త‌గ్గుతాయి.

Russo-Ukrainian War: ర‌ష్యా క్షిప‌ణి దాడులు.. 23 మంది మృతి.. 100 మందికి గాయాలు

బూస్ట‌ర్ డోసు తీసుకుంటే రోగనిరోధ‌క ప్ర‌తిస్పంద‌న పెరుగుతుంది. దీంతో నేటి నుంచి 18 నుంచి 59 ఏళ్ళ మ‌ధ్య వ‌య‌సు వారికి బూస్ట‌ర్ డోసు వేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డానికి నిన్న రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆరోగ్య శాఖ‌ల కార్య‌ద‌ర్శుల‌తో కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రాజేశ్ భూష‌ణ్ వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో స‌మావేశం నిర్వ‌హించారు. ప‌లు ప్రాంతాల్లో ప్ర‌త్యేక వ్యాక్సినేష‌న్ శిబిరాలు నిర్వ‌హించాల‌ని చెప్పారు.