Shooting Video: థాయిలాండ్లో భయానక ఘటన.. కాల్పుల్లో 22 మంది చిన్నారులు సహా 34 మంది మృతి
దాయిలాండ్లో భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఇవాళ విచక్షణారహితంగా కాల్పులు జరిపి 34 మంది ప్రాణాలు తీశాడు. వారిలో 22 మంది చిన్నారులు ఉన్నారు. దాయిలాండ్లోని నోంగ్ బువా లమ్ ఫూ ప్రావిన్స్ లోని ప్రీ స్కూల్ చైల్డ్ డే కేర్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. మాజీ పోలీసు అధికారే ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. అతడిని ఉన్నతాధికారులు కొన్ని రోజుల క్రితమే విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు.
Thailand Shooting: దాయిలాండ్లో భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఇవాళ విచక్షణారహితంగా కాల్పులు జరిపి 34 మంది ప్రాణాలు తీశాడు. వారిలో 22 మంది చిన్నారులు ఉన్నారు. దాయిలాండ్లోని నోంగ్ బువా లమ్ ఫూ ప్రావిన్స్ లోని ప్రీ స్కూల్ చైల్డ్ డే కేర్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. మాజీ పోలీసు అధికారే ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. అతడిని ఉన్నతాధికారులు కొన్ని రోజుల క్రితమే విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు.
అతడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించామని వివరించారు. కాల్పులతో పాటు కొందరిని నిందితుడు కత్తితో పొడిచి చంపినట్లు చెప్పారు. అతడు ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడన్న విషయంపై స్పష్టత లేదని తెలిపారు. ఓ ట్రక్కులో నిందితుడు తిరుగుతూ కనపడ్డాడని అన్నారు. పలు ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించామని చెప్పారు. కాగా, థాయిలాండ్ లో ఇటువంటి కాల్పుల ఘటనలు పెరిగిపోతున్నాయి. నఖోన్ రాట్చసిమాలో 2020లో ఓ ఆర్మీ అధికారి కాల్పులు జరిపి 21 మందిని చంపాడు. ఆ ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయి.
??Fusillade dans une crèche à Na Klang, dans la province de Nong Bua Lamphu, les autorités thaïlandaises annoncent un bilan provisoire de 30 décès dont 23 enfants #RIP #Thailand #NaKlang pic.twitter.com/Fx11KNyUPI
— Senegal24News (@Senegal24News) October 6, 2022
JUST IN: Shooting reported at childcare centre in Nong Bua Lamphu, northern Thailand. Casualties reported. Suspected gunman still at large https://t.co/UqEF4bW4E7
— Pichayada P. (@PichayadaCNA) October 6, 2022
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..