రాయ్‌దుర్గ్ మెట్రో స్టేష‌న్‌లో ప్రత్యేకమైన మెట్ల‌ు : ఎక్కండీ..బరువు తగ్గించుకోండి 

  • Published By: veegamteam ,Published On : February 22, 2020 / 09:59 AM IST
రాయ్‌దుర్గ్ మెట్రో స్టేష‌న్‌లో ప్రత్యేకమైన మెట్ల‌ు : ఎక్కండీ..బరువు తగ్గించుకోండి 

హైదరాబాద్ న‌గ‌రంలోని రాయ్‌దుర్గ్ మెట్రో స్టేష‌న్‌లో.. కొత్త త‌ర‌హా మెట్ల‌ను ఏర్పాటు చేశారు. ఈ మెట్లు ఎక్కితే మీ ఒంట్లో ఉండే క్యాలరీలు తగ్గించుకోండి..బరువు తగ్గించుకోండి అంటున్నారు అధికారులు.  

రాయ్‌దుర్గ్ మెట్రో స్టేష‌న్‌లో మెట్లు ఎక్కుతుంటే..ఎన్ని క్యాల‌రీల ఎన‌ర్జీ ఖ‌ర్చు అవుతుందో.. ఆ అంకెల‌ను మెట్లపై రాశారు. కాగా ప్ర‌యాణికులు ఎక్కువగా లిఫ్ట్‌ల‌నే వాడుతున్న‌ట్లు గుర్తించిన అధికారులు మెట్ల ద్వారా వెళితే మంచిదనే ఉద్ధేశ్యంతో ఇటువంటి వినూత్న మెట్లను ఏర్పాటు చేశారు. ప్రయాణీకులకు మెట్ల‌ు ఎక్కటం కూడా అల‌వాటు చేయాల‌న్న ఉద్దేశంతో ఓ వినూత్న కాన్సెప్ట్‌ను క్రియేట్ చేశారు. 

ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే.. 0.5 క్యాల‌రీల ఎన‌ర్జీ ఖ‌ర్చు అవుతుంద‌ని  ఆ మెట్ల‌పై రాశారు. హైద‌రాబాద్‌ను హెల్తీ సిటీగా మార్చాల‌న్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్‌ను డెవ‌ల‌ప్ చేసిన‌ట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇదే త‌ర‌హా క్యాలరీ మెట్ల‌ను మిగితా మెట్రో స్టేష‌న్ల‌లోనూ నిర్మించాల‌ని భావిస్తున్నారు.