Gold Price Today : బంగారం కొనుగోలుదారులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన గోల్డ్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో

Gold Price Today : బంగారం కొనుగోలుదారులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన గోల్డ్ ధరలు

Gold And Silver Price Today

Gold and Silver Price Today : కేంద్ర బడ్జెట్ తరువాత బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల చోటు చేసుకుంది. 10గ్రాముల బంగారం ధర దాదాపు రూ.5 నుంచి రూ.7వేలు దిగొచ్చింది. వెండిపై సుమారు రూ.11వేలు తగ్గింది. దీంతో బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మధ్య తరగతి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బంగారం దుకాణాలు రద్దీగా కనిపిస్తున్నాయి. తాజాగా నమోదైన వివరాల ప్రకారం.. ఇవాళ బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఓసారి పరిశీలిద్దాం.

Gold

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,250 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.69,000.

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.63,400 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 69,150.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.63,250 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 69,000.
చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,650 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70,530 కు చేరింది.

Gold
వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా ఆదివారం వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 89,000.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.89,000.
కోల్ కతాలో కిలో వెండి ధర రూ. 84,500 వద్ద కొనసాగుతుంది.
ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.84,500.
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 84,250 వద్ద కొనసాగుతుంది.

Gold
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.