David Warner: రష్మిక మందన్నాకు సారీ చెప్పిన డేవిడ్ వార్నర్.. వైరల్ అవుతున్న ఆ వీడియో వల్లే
ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హీరోయిన్ రష్మిక మందన్నాకు క్షమాపణలు చెప్పాడు. ఆమె నటించిన భీష్మ మూవీలోని పాటకు స్పూఫ్ వీడియో చేసినందుకు గాను, వార్నర్ సారీ చెప్పాడు.
David Warner: ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హీరోయిన్ రష్మిక మందన్నాకు క్షమాపణలు చెప్పాడు. దీనికో కారణం ఉంది. ఐపీఎల్ ద్వారా తెలుగువారితోపాటు ఇండియన్స్‌కు కూడా దగ్గరయ్యాడు డేవిడ్ వార్నర్. హైదరాబాద్ తరఫున ఆడిన వార్నర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు.
Hemant Soren: నేను ముఖ్యమంత్రిని.. దేశం విడిచి పారిపోతానా? ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్
ఫ్యాన్స్ కోసం ట్రెండీ వీడియోస్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంటాడు. ముఖ్యంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఫేమస్ వీడియోల స్పూఫ్ వీడియోలు పోస్టు చేస్తుంటాడు. ఒరిజినల్ ఆర్టిస్టుల ఫేస్ స్థానంలో తన ఫేస్ మార్చి ఆ వీడియోల్ని పోస్ట్ చేస్తుంటాడు. ఇవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. తాజాగా భీష్మ మూవీలోని రష్మిక మందన్నా పాటలోని డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. రష్మిక ఫేస్ స్థానంలో తన ఫేస్ ఉన్న డ్యాన్సింగ్ వీడియోను వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనికి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ వీడియోపై మీమ్స్, జోక్స్ పేలుతున్నాయి.
ఇది నెటిజన్లను బాగా నవ్విస్తోంది. కాగా, ఈ వీడియో పోస్ట్ చేసిన సందర్భంగా రష్మికకు వార్నర్ సారీ చెప్పాడు. డేవిడ్ వార్నర్ గతంలో ఐపీఎల్లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం ఢిల్లీ జట్టు తరఫున ఆడుతున్నాడు.
View this post on Instagram