iPhone 14 Flipkart Offer : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై అదిరే డీల్.. ఫీచర్లు అదుర్స్.. ఇలా చేస్తే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు..!
iPhone 14 Flipkart Sale : ప్రముఖ ఆపిల్ (Apple) యూజర్లకు అలర్ట్.. ఐఫోన్ 14 లాంచ్ (iPhone 14 Launch) అయిన తర్వాత మొదటిసారిగా ధర తగ్గింది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.2500 తగ్గింపును పొందింది.
iPhone 14 Flipkart Sale : ప్రముఖ ఆపిల్ (Apple) యూజర్లకు అలర్ట్.. ఐఫోన్ 14 లాంచ్ (iPhone 14 Launch) అయిన తర్వాత మొదటిసారిగా ధర తగ్గింది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.2500 తగ్గింపును పొందింది. ఆసక్తికరంగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 14 ధర రూ. 79,900కి లాంచ్ అయింది. అయితే, ఈ డివైజ్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.77,400గా లిస్టు అయింది. ఈ ధర ఏదైనా బ్యాంక్ ఆఫర్ లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కలిగి ఉండదని గమనించాలి. అయితే, మీరు పాత స్మార్ట్‌ఫోన్, HDFC బ్యాంక్ కార్డ్ కలిగి ఉంటే.. మాత్రం మీరు ఈ డివైజ్‌ను రూ.60వేల లోపు ధరకే పొందవచ్చు.
iPhone 14 డీల్ ఎలా ఉందంటే? :
ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 77,400గా లిస్టు అయింది. లాంచ్ అయినప్పటి నుంచి డివైజ్ ధరలో అత్యంత తక్కువ ధర ఇదే అని చెప్పవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 128GB వేరియంట్ అసలు ధర రూ.79,900గా ఉంది. ఇంకా, HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్లు స్మార్ట్‌ఫోన్‌పై రూ. 5వేలు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. తద్వారా ఐఫోన్ 14 ధర రూ.72,400కి తగ్గింది. ఇప్పుడు, మీ వద్ద iPhone 11 లేదా iPhone 12 వంటి పాత iPhone ఉంటే.. మీరు ఎక్స్చేంజ్ వాల్యూ ధర రూ. 19వేల వరకు పొందవచ్చు. మీ ఫోన్ కండిషన్ బాగుంటే.. ధర కూడా బ్యాటరీ హెల్త్‌పై ఆధారపడి ఉంటుంది. మీ పాత ఆండ్రాయిడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
Read Also : iPhone 14 Price Offer : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. ఇదే సరైన సమయం.. ఇప్పుడే కొనేసుకోండి..!
iPhone 14: స్పెసిఫికేషన్లు ఇవే :
ఆపిల్ iPhone 14 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED ప్యానెల్‌ను సన్నని బెజెల్స్‌తో అందిస్తోంది. వైడ్ కలర్ ఆప్షన్లతో వచ్చింది. డిస్ప్లే HDRకి సపోర్టు ఇస్తుంది. 1200-నిట్స్ బ్రైట్నెస్, ఫేస్ ID సెన్సార్లతో వస్తుంది. 60Hz ప్రామాణిక రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 14లో A15 బయోనిక్ చిప్, 16-కోర్ NPU, 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ప్రాసెసర్ గరిష్టంగా 4GB RAM మూడు స్టోరేజీ (128GB, 256GB, 512GB) ఆప్షన్లలతో వచ్చింది. ఐఫోన్ 14 లేటెస్ట్ స్టేబుల్ iOS 16 వెర్షన్‌తో రన్ అవుతుంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే.. స్మార్ట్‌ఫోన్ 5G, Wi-Fi, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, GPS, ఛార్జింగ్ కోసం లైట్నింగ్ పోర్ట్‌కు సపోర్టుతో వస్తుంది. కెమెరా విషయానికొస్తే.. iPhone 14 డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో పెద్ద f/1.5 ఎపర్చరు, సెన్సార్-షిఫ్ట్ OIS, సెకండరీ 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్‌తో కూడిన ప్రైమరీ 12MP వైడ్ యాంగిల్ సెన్సార్ ఉన్నాయి. వీడియో రికార్డింగ్ కోసం, డాల్బీ విజన్‌కు సపోర్టు అందిస్తుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..