ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలకు అనుమతి

  • Published By: vamsi ,Published On : May 1, 2020 / 04:07 PM IST
ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలకు అనుమతి

దేశవ్యాప్తంగా మే 17వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగనున్నట్లు ప్రకటించిన క్రమంలో గ్రీన్‌ జోన్లు, ఆరేంజ్‌ జోన్లలో ఆంక్షల సడలింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో ఆన్‌లైన్‌ ద్వారా నిత్యావసర సరుకులే కాకుండా ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటి ఇతర వస్తువులు అమ్మేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఈ కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో పూర్తిస్ధాయిలో ఈకామర్స్‌ సేవలకు అనుమతి ఇచ్చింది. కొత్త ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కోసం షాపింగ్ చేయాలనుకునే వారికి ఇది ప్రయోజనం చేకూరుస్తుంది.

అంతకుముందు ఏప్రిల్‌లో ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా అవసరమైన వస్తువులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ అవసరం లేని వస్తువులను ఇప్పటికీ నిషేధించింది. అందువల్ల, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్‌లు మరియు ల్యాప్‌టాప్‌ల అమ్మకాలను నిలిపివేయగా.. ఇప్పుడు మళ్లీ వాటి అమ్మకాలను ప్రారంభించనున్నారు.