వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? జియో ఆఫర్లు ఇవే!

  • Published By: vamsi ,Published On : May 8, 2020 / 02:28 PM IST
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? జియో ఆఫర్లు ఇవే!

కరోనా సమయంలో ప్రతి ఒక్కరు వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యాల్సిన పరిస్థితి. అయితే అందరికీ కూడా డేటా ఎక్కవ అవసరం అవుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఇంటి దగ్గర నుంచి వర్క్ ప్రమ్ హోమ్ చేసుకునేవాళ్ల కోసం జియో నెట్ వర్క్ ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించింది. 

తన వినియోగదారుల కోసం రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి నుంచి పని చేస్తున్న వారి కోసం ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్లాన్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ. 2,121 ప్లాన్ కు అదనంగా రూ. 2,399తో మరో ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కాలపరిమితి 336 రోజులు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ. 2,121 ప్లాన్ లో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 2,399 ప్లాన్ తో రోజుకు 2 జీబీ డేటా వాడుకోవచ్చు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారి కోసం యాడ్ ఆన్ ప్యాక్స్ ను కూడా జియో ఆఫర్ చేస్తోంది. రూ. 151, రూ. 201, రూ. 251 ప్లాన్లతో డేటా లభిస్తుంది. వీటికి డేటా పరిమితి లేదు. డేటా అయిపోతే ఏ సమయంలోనైనా రీచార్జ్ చేసుకోవచ్చు.