లాక్‌డౌన్‌లో భార్యలకు నరకం చూపిస్తున్న భర్తలు!

  • Published By: srihari ,Published On : May 11, 2020 / 01:37 AM IST
లాక్‌డౌన్‌లో భార్యలకు నరకం చూపిస్తున్న భర్తలు!

లాక్‌డౌన్‌ సమయంలో భర్తలు భార్యలను చితకబాదారు. తమను కాపాడాలంటూ బాధిత మహిళలంతా డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. రంగంలోకి దిగిన సైబరాబాద్‌ షీటీమ్స్‌ అండగా నిలబడ్డాయి. బాధిత మహిళలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మేము ఉన్నామంటూ భరోసా కల్పించాయి. లాక్‌డౌన్‌లోని 47 రోజుల్లో సైబరాబాద్‌ పరిధిలోనే 790 మంది మహిళలు గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులందాయి. మద్యం షాపులు తెర్చుకున్న ఒక రోజులో దాదాపు 50మంది మహిళలు వారి మొగుళ్ల చేతిలో చిత్రహింసలకు గురయ్యారు. 

భార్యాభర్తలు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరికి వారు స్మార్ట్‌ ఫోన్‌‌లో మునిగిపోయారు. ఓ రోజు భర్త ఫోన్‌ హిస్టరీని చూడగా మరో యువతితో వివాహేతర సంబంధం ఉన్న విషయం బయటపడింది. వెంటనే ఆమె నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన భర్త ఆమెను చితకబాదాడు. ఆమె భరించలేక డయల్‌ 100కు ఫోన్‌ చేసింది. తనను కాపాడాలని కోరింది. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు ఆమె పరిస్థితిని గమనించి షీటీమ్స్‌ను సమాచారం ఇచ్చారు. షీటీమ్స్‌ ఇంటికి చేరుకున్నాయి. భర్తను తీవ్రంగా మందలించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 

మరో సాఫ్ట్‌వేర్‌ కుటుంబంలో ఇలాంటి పరిస్థితే ఉంది. భార్య ఫోన్‌ను తనిఖీ చేసిన భర్తకు ఆమె దొంగచాటు ప్రేమాయణం తెలిసింది. వెంటనే ఆమెను ప్రశ్నలతో సూటిపొటి మాటలతో చితకబాదాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ మహిళ డయల్‌ 100కు ఫోన్‌ చేసింది. స్థానిక పోలీసుల సహాయంతో షీటీమ్స్‌ దర్యాప్తునకు దిగి విషయాన్ని పరిశీలించాయి. తాను ఇక్కడ ఉండలేనని తన పుట్టింటికి తీసుకువెళ్లాలని ఆమె చెప్పడంతో ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చి ఆమెను అమ్మగారింట్లో దించేశారు. 

లాక్‌డౌన్‌తో ఇద్దరు ఇంట్లోనే ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంట్లో పనులు చేయాల్సిందిగా భార్య భర్తను కోరింది. ఇంటి పని చెప్పుతావా అంటూ ఆమెపై విరుచుకుపడ్డాడు. మరోసారి ఇలాంటి పనులు చెబితే చంపేస్తానంటూ హెచ్చరించాడు. భార్య తనను కాపాడాలంటూ డయల్‌ 100కు ఫోన్‌ చేసింది. షీటీమ్స్‌ వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి బాధిత మహిళను పుట్టింటికి తరలించారు. 

కుటుంబంలో పూల్‌గా తాగిన భర్తను ప్రశ్నించినందుకు బాగా కొట్టాడు. ఇంట్లో పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉండాలని నాకే సూచిస్తావా అంటూ భార్యపై ఎగబడ్డాడు. దెబ్బలకు తాళలేక భార్య డయల్‌ 100లో షీటీమ్స్‌ను సంప్రదించింది. లాక్‌డౌన్‌ సమయంలో భార్యలను చితకబాదిన సంఘటనలు దాదాపు 70వరకు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌లో సైబరాబాద్‌ పరిధిలో మొత్తం 790 మంది మహిళలు గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయి. 

Read More :

మద్యం మత్తులో మహిళా పంచాయతీ కార్యదర్శిపై యువకులు దాడి

లాక్ డౌన్ లో ఘోరం, భార్య చెల్లిపై భర్త అఘాయిత్యం