రియల్ హీరో.. ఆ గ్రామం గుండెల్లో కొలువైన ఇర్ఫాన్ ఖాన్

  • Published By: srihari ,Published On : May 11, 2020 / 05:44 AM IST
రియల్ హీరో.. ఆ గ్రామం గుండెల్లో కొలువైన ఇర్ఫాన్ ఖాన్

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ భౌతికంగా లేకపోయినా ఆయన ఆ గ్రామం గుండెల్లో ఎప్పుడు కొలువై ఉన్నాడు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన ఇర్ఫాన్ అంటే.. ఆ గ్రామస్థులకు ఎనలేని అభిమానం.. రియల్ హీరోగా నిలిచిపోయాడు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో ఇర్ఫాన్ చూపించిన చొరవే ఇప్పుడు ఆయన్ను ఆ గ్రామానికి హీరోను చేసింది. తెరపై హీరోగా అభిమానులను సంపాదించుకున్నప్పటికీ నిజమైన హీరోగా గ్రామస్థుల గుండెల్లో సజీవంగా నిలిచిపోయారు. అందుకే మహారాష్ట్రలోని ఇగత్ పురి గ్రామవాసులంతా ఇర్ఫాన్ మృతిని జీర్ణించుకోలేకపోయారు. ఇర్ఫాన్ జ్ఞాపకంగా తమ గ్రామానికి ‘Hero-chi-Wadi’ అంటే.. ‘నైబర్ హుడ్ హీరో’ అని అధికారికంగా పేరుపెట్టేశారు. 
Irfan khan

ఈ విషయాన్ని ఇగత్ పురి జిల్లా పరిషత్ సభ్యులు గోరఖ్ బుడ్కే ఇండియా టూడేకు తెలిపారు. ఇగత్ పురి గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన ఎంతోమంది విద్యార్థుల చదువు కోసం ఇర్ఫాన్ ఖాన్ ఎంతో కృషి చేశారు. చదువుకోలేని గ్రామవాసులకు విద్య అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. అందుకే ఇర్ఫాన్ ను అక్కడి గ్రామవాసులు తమ గుండెల్లో పెట్టుకున్నారు. వాస్తవానికి ఇగత్ పురిలో సినిమా థియేటర్లు ఒకటి కూడా లేవు. తమ నిజమైన హీరో సినిమాల కోసం వారంతా 30 కిలోమీటర్ల వరకు వెళ్లి చూసి వచ్చేవారు. కష్ట సమయాల్లో ఇర్ఫాన్ అవసరమైనప్పుడు వారికి అండగా నిలబడ్డాడు. 
irfan khan

విద్యార్థుల కోసం పుస్తకాలు, స్కూల్ సదుపాయాలు, అంబులెన్స్ వంటి ఎన్నో సౌకర్యాలను ఇర్ఫాన్ కల్పించినట్టు బుడ్కే తెలిపారు. వారంతంలో గ్రామానికి వచ్చి వెళ్లేందుకు ఇర్ఫాన్ అక్కడే ఒక ప్లాట్ కొన్నాడు. సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ను ఇర్ఫాన్ పంపిన విషయం గుర్తుందని బుడ్కే తెలిపారు. రెండోసారి ఆలోచించకుండా ఇర్ఫాన్ అందులో ఒకటి విరాళంగా ఇచ్చేశాడు. ఎంతోమంది కుటుంబాలకు గార్డియన్ గా ఇర్ఫాన్ ఎన్నో సేవలు అందించాడు. అంతేకాదు.. ఇర్ఫాన్ నోటు పుస్తకాలు, రెయిన్ కోట్లు, స్వెట్టర్లను విరాళంగా అందించేవారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్వీట్లను పంపేవారు.
irfan khans