ఏపీ ప్రాజెక్ట్‌పై సీఎం కేసీఆర్ అభ్యంతరం

  • Published By: vamsi ,Published On : May 12, 2020 / 02:00 AM IST
ఏపీ ప్రాజెక్ట్‌పై సీఎం కేసీఆర్ అభ్యంతరం

కృష్ణా జలాల అంశంపై ముఖ్యమంత్రి కేసిఆర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రగతి భవన్‌లో జరిగిన కీలక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు కేసిఆర్. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల మంత్రులతో పాటు ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, అడ్వకేట్‌ జనరల్‌ ప్రసాద్‌ హాజరయ్యారు.

కృష్ణా నుంచి రోజూ 10 టీఎంసీలు తరలించేలా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో సీఎం కేసిఆర్ సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్‌. ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ ఏపీ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్న ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని అందుకోసం న్యాయ పోరాటం కూడా చేస్తామని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై వెంటనే కృష్ణా వాటర్ మేనేజ్ మెంట్ బోర్డులో తెలంగాణ తరపున ఫిర్యాదు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఉమ్మడి ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని, అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడాన్ని సీఎం కేసీఆర్ తప్పుబట్టారు.  ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ అడ్డుకునేందుకు రాజీ లేకుండా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. 

Read More:

జూలై-ఆగస్టు మాసాల్లోనే హైదరాబాద్ నుంచే కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం, ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం కేసీఆర్

తెలంగాణలో రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికులకు కొత్త నిబంధనలు