UAE To INDIA : విమాన టికెట్ల కోసం బంగారం అమ్మేస్తున్న వలస కార్మికులు

  • Published By: madhu ,Published On : May 12, 2020 / 02:58 AM IST
UAE To INDIA : విమాన టికెట్ల కోసం బంగారం అమ్మేస్తున్న వలస కార్మికులు

చైనా నుంచి వచ్చిన కరోనా భూతం..ఎంతో మందిని కబళించి వేసింది. ఇంకా ఎంతో మందిని చంపేస్తోంది. ఎప్పుడు తగ్గిపోతుందనే దానిపై క్లారిటీ రావడం లేదు. వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు సైంటిస్టులు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో లాక్ డౌన్ ప్రకటించాయి పలు దేశాలు. భారతదేశంలో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. కానీ వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంత దేశానికి వచ్చేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. 

వీరిని దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం పలు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ప్రత్యేక విమానాల ద్వారా..తీసుకొచ్చారు. కానీ UAEలో ఉంటున్న భారత వలస కార్మికులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారి పరిస్థితి దయనీయంగా ఉంది. కరోనా వైరస్ కారణంగా..జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. 

2020, మే 07వ తేదీ నుంచి భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా దుబాయ్ లో బంగారం ధరలు రెట్టింపు అయ్యాయి. 2020, మే 11వ తేదీ సోమవారం 22 క్యారెట్ల గ్రాము బంగారం..193.50 దిర్హమ్ లు (రూ. 3 వేల 963) గా ఉంది.

సొంతూరికి వెళుదాం..చావో..బతుకో..అక్కడే..తమ కుటుంబసభ్యుల వద్దకు చేరుకోవాలని వలస కార్మికులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వారు తపన పడుతున్నారు. అయితే…విమాన టికెట్లు కొనుక్కొందామంటే డబ్బులు లేని పరిస్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. 

దీనితో తమవద్దనున్న బంగారాన్ని అమ్మేసి..టికెట్లు కొనుక్కొంటున్నారు. దుబాయ్ లోని డేరా ప్రాంతాల్లో చిన్న చిన్న బంగారు దుకాణాల్లో ఎక్కువగా కొనుగోళ్లు విక్రయాలు జరుగుతున్నాయి. భారత్ కు తిరిగి వచ్చిన తర్వాత..బంగారం అమ్ముకొంటే…10 నుంచి 12 శాతం ఎక్కువ ధర వస్తుందని తెలిసినా..సొంత దేశానికి..సొంత రాష్ట్రానికి వెళ్లే ఆత్రం వారిలో కనిపిస్తోంది. 

Read More :

అమెరికా నుంచి హైదరాబాద్‌కు 118మంది తెలుగువారు