అమెరికా నుంచి హైదరాబాద్‌కు 118మంది తెలుగువారు

  • Published By: srihari ,Published On : May 11, 2020 / 07:15 AM IST
అమెరికా నుంచి హైదరాబాద్‌కు 118మంది తెలుగువారు

వందే భారత్ మిషన్ లో భాగంగా ఇతర దేశాల్లో ఉన్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ఇండియాకు తరలిస్తోంది. అమెరికా నుంచి ముంబై మీదుగా ప్రత్యేక విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అమెరికా నుంచి 118 మంది తెలుగువారు హైదరాబాద్ కు  చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో వారికి అధికారులు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని ఆస్పత్రికి తరలించనున్నారు. మిగతా వారిని ఆర్టీసీ బస్సుల్లో ఫెయిర్ క్వారంటైన్ కు తరలించనున్నారు. 

కరోనా నేపథ్యంలో గత నెల 22 వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలను నిలిపివేశారు. అయితే వందే భారత్ మిషన్ లో భాగంగా  ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు ఎవరైతే ఉంటారో వారిని భారత్ కు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్టులో అమెరికా నుంచి 118 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇప్పటికే ఫ్లైట్ ల్యాండ్ అయింది.  9:22 నిమిషాలకు ఫ్లైట్ శాన్ ఫ్రాన్సిస్కో నుండి ముంబైకి, మంబై నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి రావడం జరిగింది. 

లోపల ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా కొనసాగుతుంది. ఆ తర్వాత పర్సన్స్ చెకింగ్, ఆ తర్వాత థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత 20 మంది చొప్పున అంటే దశల వారీగా వారిని బయటకు పంపించి వారిని తీసుకొచ్చి ఆర్టీసీ ఏసీ బస్సుల్లో, అలాగే వారి లకేజీ కోసం కార్గో వాహనాలను తీసుకొచ్చారు.  రాష్ట్ర ప్రభుత్వం వారికి పెయిడ్ హోటల్స్ ను ఏర్పాటు చేసింది. 

అలాగే కాచిగూడలో, ఇతర ప్రాంతాల్లో మూడు, నాలుగు హోటల్స్ ఉన్నాయి. 2 స్టార్ నుంచి 4 స్టార్ వరకు పది వేలు చెల్లించుకోగలిగినవారికి  కొన్ని హోటల్స్, 30 వేల వరకు చెల్లించుకోగలిగిన వారికి  మరికొన్ని హోటల్స్  నిర్ణయించటం జరిగింది. వాటిల్లో వారికి ఇష్టమైన హోటలకు వారిని తరలించారు.

Read More :

12 నుంచి 15 రైళ్లు ప్రారంభం.. టికెట్ల బుకింగ్ ఎప్పుడంటే?

రైలు ప్రయాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్…కరోనా లక్షణాలు లేనివారికి మాత్రమే అనుమతి