రైలు ప్రయాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్…కరోనా లక్షణాలు లేనివారికి మాత్రమే అనుమతి

  • Published By: srihari ,Published On : May 10, 2020 / 04:18 PM IST
రైలు ప్రయాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్…కరోనా లక్షణాలు లేనివారికి మాత్రమే అనుమతి

లాక్ డౌన్ ఆంక్షలను కేంద్ర ఒక్కొక్కటిగా సడలిస్తోంది. రైలు ప్రయాణాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 12 నుంచి రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఎల్లుండి నుంచి పలు రైళ్ల రాకపోకలు సాగనున్నాయి. ఢిల్లీ నుంచి 15 రూట్లలో 30 రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది.  ఈనెల 12న సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ రైలు బయలుదేరనుంది. 

ఢిల్లీ, పాట్నా, భువనేశ్వర్, రాంచి, బెంగళూరు, చెన్నై, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, సికింద్రాబాద్ తోపాటు పలు ప్రాంతాలకు రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఢిల్లీ నుంచి మడ్గావ్, జమ్మూ-తావికి రైళ్ల రాకపోకలు సాగనున్నాయి. రేపు సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో మాత్రమే రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ ప్రకటించింది. 

ఢిల్లీ నుంచి రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నైకి రైళ్లు నడపనున్నారు. ఢిల్లీ నుంచి తిరువనంతపురం, ముంబై, అహ్మదాబాద్ కు రైళ్లు వెళ్లనున్నాయి. ఢిల్లీ నుంచి ది బ్రూగఢ్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్ పూర్ కు రైళ్లు నడవనున్నాయి. 

కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే రైళ్లలోకి అనుమతి ఇస్తామని తెలిపింది. రైల్వే స్టేషనల్లో ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. రైలు ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేసింది. ఏపీకి నేరుగా రైలు లేదు.