తెలంగాణలో కరోనా కొత్త కేసులు @ 51..వలస కూలీలకు వైరస్

  • Published By: madhu ,Published On : May 13, 2020 / 12:03 AM IST
తెలంగాణలో కరోనా కొత్త కేసులు @ 51..వలస కూలీలకు వైరస్

తెలంగాణలో ఇక కరోనాతో సహజీవనం చేయాల్సిందేనా ? అంటే ఎస్ అనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. రోజుకు డబుల్ డిజిటల్ సంఖ్యలో కేసులు నమోదు కావడం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది.

రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధిక భాగం GHMC పరిధిలో కావడం ఆందోళనకు గురి చేస్తోంది. 2020, మే 12వ తేదీ మంగళవారం సాయంత్రానికి 51 కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీలో 37 కేసులు ఉండడం గమనార్హం. 

ఇప్పటి వరకు రాష్ట్రంలో కేసుల సంఖ్య 1, 326కు చేరుకుంది. మంగళవారం ఇద్దరు చనిపోయారని విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. హైదరాబాద్ మూసాబౌలీకి చెందిన 61 ఏళ్ల వ్యక్తికి కరోనాతో పాటు, బీపీ ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉండడంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. జియాగూడ ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వ్యక్తికి మదుమేహం, బీపీ కూడా ఉండడంతో చికిత్స పొందుతూ చనిపోయారని తెలిపారు. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 32కు చేరుకుందన్నారు. 

ఇక GHMC పరిధిలో 37 కేసులుండగా..మిగిలిన 14 కేసులు వలస కూలీలని తెలిపారు. 12 మంది యాదాద్రి జిల్లాకు చెందిన వారుండగా, మరో ఇద్దరు జగిత్యాలకు చెందిన వారు. మంగళవారం 21 మంది కోలుకుని ఇంటికి వెళ్లారని, ఇప్పటివరకు 822 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 472 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. 

Read More:
 

తెలంగాణలో కరోనా : జియాగూడలో వైరస్ ఎలా సోకిందంటే

* దేశానికే రోల్ మోడల్ : కరోనాను తరిమేసిన కరీంనగర్ వాసులు