బాబోయ్: వాడి చెత్తలో పడేసిన మాస్క్ లనే మళ్లీ అమ్మేస్తున్నారు

  • Published By: nagamani ,Published On : May 13, 2020 / 12:16 PM IST
బాబోయ్: వాడి చెత్తలో పడేసిన మాస్క్ లనే మళ్లీ అమ్మేస్తున్నారు

ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా ఎవ్వరి ముఖాలు పూర్తిగా కనిపించటంలేదు. కారణం ముఖాలకు మాస్క్ లు కట్టేసుకోవటమే.కారణం. కరోనా. ఎక్కడ చూసినా ఇదే మాట. కరోనా ప్రభావంతో ప్రతీ ఒక్కరూ మాస్క్ లు పెట్టుకోవాల్సిన పరిస్థితి.  దీంతో మాస్క్ లకు యమా డిమాండ్ పెరిగిపోయింది. ఆన్ లైన్ లలో కూడా దొరకటంలేదు. కరోనాను కట్టుడి చేసేందుకు లాక్ డౌన్ లను పాటిస్తున్నారు. బైటకు వస్తే చాలు మాస్క్ పెట్టుకోవాల్సిందే. 

దీంతో మాస్క్ లకు ఉన్న డిమాండ్ ని పలువురు క్యాష్ చేసుకుంటున్నారు. ఎంతగా..అంటే వాడి పడేసిన మాస్క్ లను కూడా అమ్మేస్తున్నారు!!. వినటానికే భయవేస్తోంది కదూ..మనం కొనుక్కుని వాడుకున్న మాస్క్ కూడా అటువంటిదేనా అను అనుమానం వస్తే..వెన్నులోంచి వణుకు వచ్చేస్తుంది కదూ!!..ఇదేదో గల్లీలో ఉండే వ్యాపారస్తులు పడిన కక్కుర్తి కాదు అభివృద్ధి చెందిన దేశమైన అమెరికాలోని మెక్సికో నగరంలో వెలుగుచూసింది. ఒకసారి వాడి చెత్తబుట్టల్లో పారేసిన మాస్క్‌లను తిరిగి అమ్మేస్తున్న బాగోతం మెక్సికో సిటీలో బైటపడింది. ఇదేదో ఆషామాషిగా బైటకొచ్చిన న్యూస్ కాదు..ఈ విషయాన్ని సాక్షాత్తు ఫార్మా కంపెనీలు తెలిపాయి. 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విపత్కర పరిస్థితుల్లో లాటిన్ అమెరికాతోపాటు మెక్సికో నగరంలో వినియోగించిన మాస్క్‌లను వీధుల్లో విక్రయిస్తున్నారని వెల్లడైంది. చెత్తబుట్టల్లో పారేసిన సర్జికల్ ఫేస్ మాస్క్‌లను తిరిగి అమ్ముతున్నారని అందిన సమాచారంతో మెక్సికన్ ఫార్మసీ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఫేస్ మాస్క్‌లకు కొరత ఏర్పడటంతో పాటు వీటి ధరలు ఆకాశన్నంటున్నంటుతున్నాయి. దీంతో లైసెన్స్ లేని వ్యాపారులు వీధుల్లోనూ వాడి పడేసిన మాస్క్ లను తిరిగి విక్రయిస్తున్నారని ఫార్మసీ యజమానులే చెబుతున్నారు.

రోజు రోజుకూ కరోనా వ్యాప్తి ప్రబతుంటంతో వాడి పడేసిన మాస్క్ లను తిరిగి వినియోగించడం చాలా ప్రమాదకరమని వైరస్ వ్యాప్తికి కాణమవుతుందని మెక్సికో ఫార్మసీ యజమానులు చెపుతున్నారు. దీంతో ఒకసారి వాడిన మాస్క్ లను అలాగే చెత్త బుట్టల్లో పడేయకుండా వాటిని ముక్కలు ముక్కలుగా చేసి చెత్తబుట్టల్లో పారేయాలని మెక్సికో ఫార్మసీ యజమానులు సూచించారు. దీనికితోడు వాడేసిన శానిటైజర్ ఖాళీ బాటిళ్లలో నకిలీ శానిటైజర్లు తయారుచేసి పోసి విక్రయిస్తుండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. 

కక్కుర్తో..అత్యాశో మనిషికి మనిషే చేటుచేస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఇటువంటి అనాగరికి చర్యలు అందరికీ చేటుచేస్తాయి. డబ్బు సంపాదన కోసం ఇటువంటి నీచపు పనులకు పాల్పడితే అది సమాజానికే కాదు వారికే చేటు చేస్తుందని తెలుసుకోవాలి.