HIV లాగా కరోనా వైరస్ ఎప్పటికీ పోదు, బాంబు పేల్చిన WHO

కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్ మహమ్మారి. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మానవాళి మనుగడకు

  • Published By: naveen ,Published On : May 14, 2020 / 02:58 AM IST
HIV లాగా కరోనా వైరస్ ఎప్పటికీ పోదు, బాంబు పేల్చిన WHO

కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్ మహమ్మారి. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మానవాళి మనుగడకు

కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్ మహమ్మారి. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మానవాళి మనుగడకు సవాల్ విసురుతోంది. చాప కింద  నీరులా వ్యాపిస్తూ ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే లక్షల మందిని బలితీసుకుంది. ఇంకా ఎంతమందిని చంపుతుందో తెలియదు. 2019 డిసెంబర్ లో  చైనాలోని వుహాన్ లో కరోనా వైరస్ వెలుగుచూసింది. అది మొదలు మొత్తం ప్రపంచాన్ని చుట్టేసింది. వైరస్ వెలుగులోకి వచ్చి 5 నెలలు అవుతున్నా  ఇప్పటివరకు వ్యాక్సిన్ కనిపెట్ట లేకపోయారు. వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే అని డాక్టర్లు చెబుతున్నారు. కాగా, ఇంకా ఎన్ని రోజులు కరోనా  వైరస్ ముప్పు ఉంటుంది? ఇంకా ఎంతకాలం దాన్ని ఎదుర్కోవాలి? కరోనా వైరస్ నుంచి పూర్తి ముప్పు తప్పేది ఎప్పుడు? వ్యాక్సిన్ వచ్చేస్తే ఇక కరోనా  ముప్పు తప్పినట్టే, భయపడాల్సింది లేదని ఇప్పటివరకు డాక్టర్లు చెబుతూ వచ్చారు. దీంతో అంతా వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 

హెచ్ఐవీ లానే కరోనా పోదు:
ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. పెద్ద బాంబు పేల్చింది. ప్రపంచవ్యాప్తంగా సోకుతున్న హెచ్ఐవీ(AIDS)  మాదిరిగానే కరోనా వైరస్ కూడా ఎప్పటికీ పోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ మైక్ ర్యాన్ జెనీవాలో చెప్పారు. కరోనా వైరస్  సమాజంలో మరో స్థానిక వైరస్ గా మారవచ్చని, ఈ వైరస్ ఎప్పటికీ దూరం కాకపోవచ్చని డాక్టర్ మైక్ ర్యాన్ అభిప్రాయపడ్డారు. హెచ్ఐవీకి ఇంతవరకు  వ్యాక్సిన్ కనుగొనలేకపోయారని ఆయన గుర్తుచేశారు. హెచ్ ఐవీ ప్రపంచం నుంచి ఎప్పుడు మాయమవుతుందో ఎవరికీ తెలియదని, అలానే కరోనా వైరస్  కూడా అంతేన్నారు.

అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సిన్ కనుక్కుంటేనే కరోనాను నివారించగలం:
అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సిన్ ను కనుగొనగలిగితే కరోనాను నివారించగలుగుతామని మైక్ ర్యాన్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ ఎప్పుడు  మాయమవుతుందో తమకు తెలియదని, దీనికి ప్రభావవంతమైన వ్యాక్సిన్ ను కనుగొనగలిగి, దాన్ని ప్రతీ ఒక్కరికీ పంపిణీ చేయగలిగితే ఈ వైరస్ ను  అరికట్టవచ్చని డాక్టర్ మైక్ ర్యాన్ వివరించారు. కరోనాకు వ్యాక్సిన్ తయారీ కోసం డాక్టర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారని ర్యాన్ తెలిపారు. ప్రస్తుతానికి మాస్కులు  ధరించడం, భౌతిక దూరం పాటించడం, పరిశ్రుభంగా ఉండటం లాంటి కొన్ని జాగ్రత్తలతో కరోనాను అదుపు చేయడం మన చేతుల్లోనే ఉందని ర్యాన్ తేల్చి  చెప్పారు.

లాక్ డౌన్ ఆంక్షలు సడలిస్తే కరోనా ఉత్పాతం తప్పదు:
హెచ్‌ఐవి ఎప్పుడూ పోలేదు. కానీ హెచ్‌ఐవి ఉన్నవారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి మార్గాలు కనుగొన్నాము. మనం వాస్తవికంగా ఉండాలి.  వ్యాధి ఎప్పుడు మాయమవుతుందో మాకు తెలియదు. మనకు అవసరమైన ప్రతి ఒక్కరికీ పంపిణీ చేయగల అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ను  కనుగొనగలిగితే, కరోనాను తొలగించడంలో ఓ అంచనాకు రాగలం”అని ర్యాన్ చెప్పారు. మొదటిసారిగా కొత్త వైరస్ మానవ జనాభాలో ప్రవేశిస్తుంది,  అందువల్ల మనం ఎప్పుడు విజయం సాధిస్తామో ఊహించడం చాలా కష్టం అన్నారాయన. కాగా, కరోనా వైరస్ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి చాలా  దేశాలు ఏదో ఒక రకమైన లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. కరోనాను కట్టడి చేయడంలో ఈ విధానం కొంతవరకు సత్ఫలితాలను ఇచ్చింది. కానీ లాక్  డౌన్ ఆంక్షలు సడలించడం కరెక్ట్ కాదన్న ఆయన, రెండోసారి కరోనా విజృంభించే అవకాశాలు లేకపోలేదన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 44లక్షల కరోనా కేసులు, 2లక్షల 98వేల మరణాలు:
మరోవైపు కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 213 దేశాలకు విస్తరించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 44 లక్షల 27 వేల 900 కేసులు  నమోదయ్యాయి. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 24 లక్షల 71 వేల 992. వ్యాధి నుంచి కోలుకొని 16 లక్షల 57 వేల 831 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.  కోవిడ్‌-19 కారణంగా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల 98 వేల 77 మంది చనిపోయారు. 

కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల వివరాలు:
* అమెరికా-85,197
* స్పెయిన్‌-27,104
* రష్యా-2,212
* యూకే-33,106
* బ్రెజిల్‌-13,158
* ఫ్రాన్స్‌-27,074
* జర్మనీ-7,861
* టర్కీ-3,952
* ఇరాన్‌-6,783
* చైనా-4,633
* పెరూ-2,169
* కెనడా-5,302
* బెల్జియం-8,843
* నెదర్లాండ్స్‌-5,562
* మెక్సికో-4,220
* ఈక్విడార్‌-2,334
* స్విట్జర్లాండ్‌-1,870
* పోర్చుగల్‌-1,175
*స్వీడన్‌-3,460
* ఐర్లాండ్‌-1,497
* రొమేనియా-1,036
* ఇండోనేషియా-1,028 మంది మరణం

Read Here>> కరోనా సోకి సుమో రెజ్లర్ మృతి : ఏనుగులాంటివాడిని మట్టికరిపించేసిన మహమ్మారి