ఉద్యోగానికి దరఖాస్తు చేస్తూ.. ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమానికే ఆఫర్ ఇచ్చిన నిరుద్యోగి

Viral Pic: ఉద్యోగంలో చేరిన ఒక వారంలోగా తనను తాను నిరూపించుకోకపోతే జాబ్ నుంచి తనను..

ఉద్యోగానికి దరఖాస్తు చేస్తూ.. ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమానికే ఆఫర్ ఇచ్చిన నిరుద్యోగి

చదువు పూర్తికాగానే ఉద్యోగాల కోసం యువత ఎంతగా ప్రయత్నాలు చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఎలాగైనా ఉద్యోగం సాధించాలని, ఇన్నాళ్లు కష్టపడి చదువుకున్నది అందుకోసమేనని తపన పడిపోతుంటారు.

ఎన్నో ఉద్యోగాలకు దరఖాస్తులు చేస్తుంటారు. చాలా దరఖాస్తులకు కనీసం రిప్లై కూడా రాదు. ఉద్యగాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు రెజ్యూమ్ లో తమ స్కిల్స్, అర్హతల గురించి రాస్తుంటారు. అయితే, ఓ నిరుద్యోగి మాత్రం అందుకు భిన్నంగా రాసి వింగ్ఫై కంపెనీ వ్యవస్థాపకుడు పరాస్ చోప్రాను ఆశ్చర్యపర్చాడు.

ఉద్యోగానికి దరఖాస్తు చేస్తూ ఆ కంపెనీని స్థాపించిన వ్యక్తికే ఓ ఆఫర్ ఇచ్చాడు. ఈ విషయాన్ని తెలుపుతూ పరాస్ చోప్రా ట్వీట్ చేశారు. తాను వింగిఫైలో పని చేయాలనుకుంటున్నానని ఓ యువకుడు రాశాడు. అందు కోసం తాను ఓ ప్రత్యేక ప్రతిపాదనను ఆ కంపెనీ ముందు ఉంచుతున్నానని చెప్పాడు ఆ యువకుడు.

కంపెనీలో తనను నియమించుకోవడానికి తాను దాదాపు 41,600 ఇస్తానని తెలిపాడు. ఉద్యోగంలో చేరిన ఒక వారంలోగా తనను తాను నిరూపించుకోకపోతే జాబ్ నుంచి తనను తొలగించుకోవచ్చని చెప్పాడు. అలాగే, తనను తొలగిస్తే తన డబ్బును వెనక్కి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని పేర్కొన్నాడు.

కంపెనీ తిరస్కరణ కోసం తాను ఎదురు చూస్తుంటానని తెలిపాడు. ఇలా రాస్తూ దరఖాస్తు చేసుకోవడంతో అతడు అందరి దృష్టినీ ఆకర్షించాడని పరాస్ చోప్రా తెలిపారు. తానేం డబ్బులు తీసుకోకపోకపోయినా అతడు రాసిన తీరు ఆకర్షించిందని చెప్పారు.

Also Read: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గూగుల్ పిక్సెల్ 8, ఐఫోన్ 15, పోకో M6 ప్రో ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!