విమానాల్లో పైలట్లు, ఎయిర్ హోస్టెస్‌ లకు కొత్త డ్రెస్సులు..

  • Published By: nagamani ,Published On : May 15, 2020 / 06:48 AM IST
విమానాల్లో పైలట్లు, ఎయిర్ హోస్టెస్‌ లకు కొత్త డ్రెస్సులు..

భారత్ లో లాక్‌డౌన్ అమలు అనంతరం విమానాలు తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాకపోతే రోజురోజుకు కరోనా పెరుగుతున్న క్రమంలో విమాన సిబ్బంది వేసుకునే డ్రెస్సులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. విమాన సిబ్బంది వేసుకునే డ్రెస్ లకు బదులుగా.. గౌన్, మాస్క్,అప్రాన్లు, గ్లౌజులు వంటి పర్సనల్ సేఫ్టీ పరికరాలను (పిపిఇ) ధరించనున్నారు. 

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని  నియంత్రించటానికి మార్చి 25 నుంచి అన్ని  విమానాలు నిలిపివేశారు. ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్టార, ఎయిర్ ఏషియ వంటి విమానయాన సంస్థలు విమాన సిబ్బందిని వారి సేఫ్టీ కోసం పీపీఈ డ్రెస్సులు ధరించాలని నిర్ణయించినట్లు ఆయా వర్గాలు తెలిపాయి. 

ఎయిర్ ఆసియా తన సిబ్బంది కోసం ఇప్పటికే దుస్తులను డిజైన్ చేయించింది.  శరీరమంతా కప్పే ఈ ఎరుపు రంగు సూట్‌లో ఫేస్ షీల్డ్ (ఫేస్ మిర్రర్) మాస్క్ ఉంటుంది. ఎయిర్ ఏషియా సిబ్బందికి పిపిఇ దుస్తులు ఫేస్ షీల్డ్, మాస్క్, గౌన్, ఆప్రాన్, గ్లోవ్స్ కలిగి ఉన్నారు. అటు విస్టారా సిబ్బంది సభ్యులకు ల్యాప్ గౌన్, మాస్క్, ఫేస్ షీల్డ్ ఉంటుంది. ఇతర విమానయాన సంస్థలు ఇలాంటి దుస్తులను తయారు చేయించాయి. ఈ కొత్తరకం డ్రెస్సులో విమాన సిబ్బంది సురక్షితంగా ఉండటమేకాకుండా..పలు దేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది.

Read Here>> రైట్, రైట్.. రేపటి నుంచి ప్రజా రవాణా ప్రారంభం