రైట్, రైట్.. రేపటి నుంచి ప్రజా రవాణా ప్రారంభం

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణ ప్రారంభించాలని నిర్ణయించింది. ఇన్నాళ్లు డిపోలకు

  • Published By: naveen ,Published On : May 14, 2020 / 12:05 PM IST
రైట్, రైట్.. రేపటి నుంచి ప్రజా రవాణా ప్రారంభం

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణ ప్రారంభించాలని నిర్ణయించింది. ఇన్నాళ్లు డిపోలకు

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణ ప్రారంభించాలని నిర్ణయించింది. ఇన్నాళ్లు డిపోలకు పరిమితమైన బస్సులు రోడ్డెక్కనున్నాయి. అది కూడా రేపటి(మే 15, 2020) నుంచే. శుక్రవారం నుంచి  హర్యానాలో ప్రయోగాత్మక ప్రాతిపదికన ప్రజా రవాణాను ప్రారంభించనున్నట్లు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. ఈ మేరకు సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మార్చి 25న దేశ వ్యాప్తంగా మొదటి దశ లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి ప్రజా రవాణా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే మూడవ దశ లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో అన్ని కార్యకలపాలకు అనుమతిచ్చాయి. కానీ ప్రజా రవాణా వ్యవస్థను మాత్ర పునరుద్ధరించలేదు. 

గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో బస్సు సర్వీసులు:
అయితే గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రకటించాయి. ఈ క్రమంలో శుక్రవారం నుంచి హర్యానాలో ప్రజా రవాణాను ప్రారంభిస్తున్నట్లు ఖట్టర్‌ ప్రకటించారు. ఇందుకోసం బస్సులను శానిటైజ్‌ చేయడమే కాక సామాజిక దూరాన్ని పాటించేలా సీట్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణ సమయంలో ప్రజలంతా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని.. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ రోడ్డెక్కనున్న బస్సులు, ప్రయాణికులకు కొత్త నిబంధనలు:
త్వరలోనే మన తెలుగు రాష్ట్రాల్లోనూ బస్సులు నడిపేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ నెల 17వ తేదీతో మూడో దశ లాక్ డౌన్ ముగుస్తుంది. నాలుగో దశ లాక్ డౌన్ ఉంటుందని ప్రధాని మోడీ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. అయితే సరికొత్త నియమాలు, సడలింపులతో లాక్ డౌన్ 4 ఉంటుందని చెప్పారు. ఇందులో భాగంగా ప్రజా రవాణకు కేంద్రం పర్మిషన్ ఇచ్చే యోచనలో ఉందని సమాచారం. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బస్సులు నడిపేందుకు చాలా రాష్ట్రాలు రెడీగా ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో ఇప్పటికే బస్సుల రూపురేఖలు మార్చే పనిలో ఉన్నారు. భౌతిక దూరం పాటించేలా బస్సులను డిజైన్ చేస్తున్నారు. ఇకపై బస్సుల్లో కండక్టర్లు ఉండరు. ఆన్ లైన్ లోనే టికెట్లు కొనుక్కోవాలి. స్టాపులు కూడా పరిమిత సంఖ్యలోనే ఉండనున్నాయి. బస్సు ప్రయాణం చేయాలంటే చాలా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

దేశంలో 78వేల కరోనా కేసులు, 2వేల 549 మరణాలు:
దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు మ‌రింత విజృంభిస్తున్న‌ది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ప్ర‌తిరోజూ వేల‌ల్లో కొత్త కేసులు, వంద‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. బుధ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌ నుంచి గురువారం ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు కేవ‌లం 24 గంట‌ల వ్య‌ధిలో కొత్త‌గా 3,722 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 78,003కు చేరింది. 

మ‌రోవైపు దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే అన్ని రాష్ట్రాల్లో క‌లిపి 134 క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 2,549కి చేరింది. కాగా, దేశంలో న‌మోదైన మొత్తం కేసుల్లో ప్ర‌స్తుతం 49,219 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మిగ‌తా వారిలో 26,235 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, 2549 మంది మ‌ర‌ణించారు. 

Read Here>> జూన్ 30 వరకు రైళ్లు రద్దు..రిజర్వేషన్ డబ్బులు వాపస్