Hot Summer : నిప్పుల కుంపటిలా తెలుగు రాష్ట్రాలు.. భీకర ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలు

మండే ఎండలతో ఉక్కపోత పెరిగి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Hot Summer : నిప్పుల కుంపటిలా తెలుగు రాష్ట్రాలు.. భీకర ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలు

Updated On : May 3, 2024 / 6:46 PM IST

Hot Summer : సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం 8 గంటల నుంచే తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భానుడి భగభగలు రోజురోజుకి పెరిగిపోతుండటంతో ప్రజలు అడుగు బయటపెట్టాలంటేనే భయపడుతున్నారు. మండే ఎండలతో ఉక్కపోత పెరిగి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఇప్పటికే 45 డిగ్రీలకుపైగా ఉదయం పూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్, పెద్దపల్లి, జైశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ్ పేట్, జోగులాంబ గద్వాల జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎండలు దంచికొడుతున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తెలంగాణలోని సుమారు 14 జిల్లాల్లో 46.8 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను చూస్తే.. ఇప్పటికే చాలా చోట్ల 46డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం పది రోజులుగా ఏపీ, తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 4 రోజులు తెలంగాణలో మాడు పగిలే ఎండలు ఉంటాయని, వడగాల్పుల తీవ్ర ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్పడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు..
* తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
* ఈ నెల 6వరకు తీవ్ర వడగాలులు వీచే అవకాశం
* వాయువ్య దిశ నుంచి వీస్తున్న వడగాల్పులు
* పొడి వాతావరణంతో పెరిగిన వడగాల్పుల తీవ్రత
* తెలంగాణలో 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
* ఉదయం 9 దాటితే ఇళ్లకే పరిమితమవుతున్న ప్రజలు
* తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
* సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు
* భానుడి భగభగలతో నిప్పుల కొలిమిని తలపిస్తున్న తెలుగు రాష్ట్రాలు
* ఏపీ, తెలంగాణలో 45 నుంచి 47 డిగ్రీలుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు

Also Read : తిరుమలలో భారీ వర్షం, తృటిలో తప్పిన ప్రమాదం