TDP : ఆయన మారని పార్టీ లేదు, నా గురించి నీకు పూర్తిగా తెలీదు.. బొజ్జల సుధీర్, ఎస్సీవీ నాయుడు ఒకరిపై మరొకరు కౌంటర్లు

TDP : సీట్లు ఇచ్చే విషయంలో చంద్రబాబు సర్వేలు చేయించుకుని టిక్కెట్లు ఖరారు చేయాలి.

TDP : ఆయన మారని పార్టీ లేదు, నా గురించి నీకు పూర్తిగా తెలీదు.. బొజ్జల సుధీర్, ఎస్సీవీ నాయుడు ఒకరిపై మరొకరు కౌంటర్లు

Bojjala Sudhir Reddy - SCV Naidu (Photo : Twitter)

Bojjala Sudhir Reddy – SCV Naidu : : శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఎస్ సీ వీ నాయుడు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. శ్రీకాళహస్తి టీడీపీ ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు.

కాగా, టీడీపీలో చేరిక కార్యక్రమంలో పరోక్షంగా ఒకరిపై మరొకరు కౌంటర్లు వేసుకున్నారు బొజ్జల సుధీర్ రెడ్డి, ఎస్సీవీ నాయుడు. ఎస్ సీ వీ నాయుడు లక్కీ స్టార్, ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని ఓవైపు పొగుడుతూనే.. మరోవైపు ఎస్సీవీ నాయుడు అనేక పార్టీలు మారారనే కోణంలో బొజ్జల సుధీర్ రెడ్డి కామెంట్లు చేశారు.

”ఎస్సీవీ నాయుడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకెళ్లి వైఎస్సార్ ను సీఎం చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీలోకి వచ్చారు. చంద్రబాబు సీఎం అయ్యారు. 2019లో వైసీపీలోకెళ్లి జగన్ ను సీఎం చేశారు. ఇప్పుడు మళ్లీ టీడీపీలోకి వచ్చారు. కచ్చితంగా చంద్రబాబు సీఎం అవుతారు. ఎస్సీవీ నాయుడు లక్కీ ఛామ్” అని బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు.

Also Read..N Chandrababu Naidu : తెలంగాణలో అక్కడ ఎకరం రూ.30 కోట్లు, ఏపీలో ఇలాంటి ధరలు ఎక్కడున్నాయి?- చంద్రబాబు నాయుడు

ఎస్సీవీ నాయుడు కూడా తగ్గేదేలే అన్నట్లుగా మాట్లాడారు. తనను ఉద్దేశించి బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎస్సీవీ నాయుడు కూడా పరోక్షంగా కౌంటర్ ఇచ్చేశారు. ”నేను ఎక్కడుంటే ఆ పార్టీ గెలుస్తుందని సుధీర్ రెడ్డి చెప్పారు. నాకు పెద్ద పెద్ద మీసాలు ఉంటాయని రౌడీ అని అంతా అనుకునేవారు. నా మనసేంటో గోపాల కృష్ణారెడ్డికి తెలిసింది. కానీ.. సుధీర్ రెడ్డికి తెలియలేదు. ఒక్క ఓటు ఉన్నా సరే.. తలొంచి గౌరవించాలి. సీట్లు ఇచ్చే విషయంలో చంద్రబాబు సర్వేలు చేయించుకుని టిక్కెట్లు ఖరారు చేయాలి. టిక్కెట్ల ఖరారులో ఏ మాత్రం తేడా జరిగినా కష్టం అవుతుంది. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం. అందుకు మేం కృషి చేస్తాం” అని ఎస్ సీ వి నాయుడు అన్నారు.

కాగా, పార్టీ విజయం కోసం ఇద్దరం కలిసి కృషి చేస్తాము, కష్టపడి పని చేస్తాము అని బొజ్జల, ఎస్ సీ వీ నాయుడు అంటూనే.. ఒకరిపై మరొకరు కౌంటర్ల వేసుకోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కార్యకర్తలను అయోమయానికి గురి చేసింది.

Also Read..Bojjala Sudhir Reddy : ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, మన ప్రభుత్వం వచ్చాక 6నెలలు మమ్మల్ని వదిలేయండి