CPAP for sleep apnea : నిద్రలో ఊపిరాడక సీపాప్ మెషీన్ వాడుతున్న జో బైడెన్.. ఇంతకీ అదెలా పనిచేస్తుందంటే?

నిద్రలో అకస్మాత్తుగా ఊపిరి ఆడకపోవడం, కాసేపు శ్వాస ఆగిపోవడం.. స్లీప్ ఆప్నియాలో కనిపించే ప్రధాన లక్షణాలు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇదే సమస్యతో బాధపడుతూ సీపాప్ మెషీన్ వాడుతున్నారట. అసలు స్లీప్ ఆప్నియా లక్షణాలు ఏంటి? సీపాప్ మెషీన్ ఎలా పనిచేస్తుంది?

CPAP for sleep apnea : నిద్రలో ఊపిరాడక సీపాప్ మెషీన్ వాడుతున్న జో బైడెన్.. ఇంతకీ అదెలా పనిచేస్తుందంటే?

CPAP for sleep apnea

CPAP for sleep apnea : రోజంతా కష్టపడ్డ వ్యక్తికి సరైన విశ్రాంతి ఆరోగ్యకరమైన నిద్ర. నిద్ర వల్లే శరీరం మళ్లీ శక్తిని పుంజుకుంటుంది. మనసు కూడా ఉత్తేజం అవుతుంది. అయితే కొందరిలో నిద్రలేమి సమస్య ఉంటుంది. మానసిక రోగాలు, ఇతర అనారోగ్య కారణాలతో నిద్ర రాక ఇబ్బందులు పడుతుంటారు. కొందరిలో ఊపిరాడకపోవడం అనే సమస్య ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నారట. దీని పేరే స్లీప్ ఆప్నియా (Sleep Apnea) . దీని చికిత్స కోసం ఆయన సీపాప్ (CPAP-కంటిన్యూయెస్ పాజిటివ్ ఎయిర్ వేర్ ప్రెజర్) అనే వైద్య పరికరాన్ని వాడుతున్నారట. అసలు ఇలాంటి ఇబ్బంది ఎందుకు వస్తుంది. ఈ పరికరం ఎలా ఉపయోగిస్తారు?

Joe Biden: 5 మిలియన్ డాలర్ల లంచం తీసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. బాంబ్ పేల్చిన బాంబ్‭షెల్

80 సంవత్సరాల బైడెన్ మాస్క్ పెట్టుకున్నప్పుడు నొక్కుకుపోయినట్లు చారలు కనిపించాయట. దీనిని మీడియా ప్రశ్నించడంతో బైడెన్ సమస్య బయటకు వచ్చింది. నిద్రలో ఊపిరి ఆడక స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్న బైడెన్ సీపాప్ మెషీన్ ఉపయోగిస్తున్నారని వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. నిద్రలో శ్వాస తీసుకునేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది.

 

ప్రపంచంలో ఇటీవల కాలంలో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య స్లీప్ ఆప్నియా. ఊపిరాడకపోవడం, నిద్రలో కొద్దిసేపు శ్వాస ఆగిపోవడం, గట్టిగా గురక పెట్టడం, రాత్రి ఎంత నిద్రపోయినా త్వరగా అలసిపోవడం దీని ప్రధాన లక్షణాలు. ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. అధిక బరువు ఉన్నవారిలో ఎగువ శ్వాస తీసుకునే మార్గంలో కొవ్వు నిల్వలు శ్వాసను అడ్డుకుంటాయి. కొందరిలో శ్వాస నాళం ఇరుగ్గా ఉంటుంది. టాన్సిల్స్, అడినాయిడ్స్ కూడా ఈ నాళాన్ని అడ్డుకుంటాయి. ఆల్కహాల్, మత్తుమందులు వాడే వారిలో గొంతులోని కండరాలు సడలింపు కారణంగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాను తీవ్రతరం చేస్తుంది.

US-China tensions: జిన్‭పింగ్‭ను నియంత అంటూ విరుచుకుపడ్డ బైడెన్.. ఏం రెచ్చగొడుతున్నారా అంటూ అదే స్థాయిలో దాడికి దిగిన చైనా

అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటీస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, హార్మోన్ల సమస్యలు, ఆస్తమా వంటి వాటితో బాధపడేవారిలో స్లీప్ ఆప్నియా ప్రమాదం ఎక్కువ స్ధాయిలో ఉంటుంది. ఈ సమస్యను చికిత్స తీసుకోకుండా వదిలేస్తే పగలు ఎక్కువగా నిద్రపోవడం, పని మీద శ్రద్ధ లేకపోవడం ఇతర అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. దీని నుంచి బయటపడటానికి బరువు తగ్గడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం చేయాలి. అలాగే డాక్టర్లు చెప్పకుండా నిద్రమాత్రలు వాడకూడదు. వైద్యుల సూచన మేరకు మాత్రమే సీపాప్ మెషీన్ వాడాల్సి ఉంటుంది. ఈ మెషీన్ నోరు, ముక్కు మీదుగా గాలిని మాస్క్ లోకి పంపుతుంది.