Joe Biden: 5 మిలియన్ డాలర్ల లంచం తీసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. బాంబ్ పేల్చిన బాంబ్‭షెల్

ఫాక్స్ న్యూస్ ప్రచురించిన ఈ కథనం ఎఫ్‭బీఐ ఎఫ్‭డీ 1023 ఫాం ఆధారంగా ప్రచురించింది. రహస్యంగా మానవ వనరుల నుంచి అందింన వెరిఫై చేయని సమాచారన్ని సాధారణంగా ఎఫ్‭బీఐ ఈ ఫాంలో పొందుపరుస్తుంది. దీని ఆధారంగానే 2020 జూన్ నెలలో ఓ వ్యక్తి ఎఫ్‭బీఐకి పైన పేర్కొన్న లంచం గురించి తెలిపారు

Joe Biden: 5 మిలియన్ డాలర్ల లంచం తీసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. బాంబ్ పేల్చిన బాంబ్‭షెల్

Bribe: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‭పై బాంబ్‭షెల్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్‭కు చెందిన బురిస్మా హోల్డింగ్స్ అనే గ్యాస్ కంపెనీ నుంచి ఆయన ఐదు మిలియన్ డాలర్లు లంచం తీసుకున్నారని బాంబ్‭షెల్ రిపోర్టు వెల్లడించినట్లు అమెరికాకు చెందిన ఫాక్స్ న్యూస్ ఓ కథనం ప్రచురించింది. బురిస్మా హోల్డింగ్స్ కంపెనీలో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ బోర్డ్ సభ్యుడిగా ఉన్నారు. ఇక ఈ ఆరోపణల ఆధారంగా బురిస్మా హోల్డింగ్స్ కంపెనీ మీద ఉక్రెయినియన్ దర్యాప్తు సంస్థ విచారణ చేస్తోంది.

Hiroshi Suzuki Viral Video: ‘బాబోయ్ నా భార్య కారంతో చంపేస్తోంది’, ఇండియన్ ఫుడ్‭పై జపాన్ అంబాసిడర్ ట్వీట్.. ప్రధాని మోదీ ఏమన్నారో తెలుసా?

ఫాక్స్ న్యూస్ ప్రచురించిన ఈ కథనం ఎఫ్‭బీఐ ఎఫ్‭డీ 1023 ఫాం ఆధారంగా ప్రచురించింది. రహస్యంగా మానవ వనరుల నుంచి అందింన వెరిఫై చేయని సమాచారన్ని సాధారణంగా ఎఫ్‭బీఐ ఈ ఫాంలో పొందుపరుస్తుంది. దీని ఆధారంగానే 2020 జూన్ నెలలో ఓ వ్యక్తి ఎఫ్‭బీఐకి పైన పేర్కొన్న లంచం గురించి తెలిపారు. అయితే ఆ వ్యక్తి అత్యంత విశ్వసనీయుడని ఎఫ్‭బీఐ చెప్పడం గమనార్హం. 2015 నాటి నుంచే బురిస్మా అధికారితో బైడెన్ చాలాసార్లు భేటీ అయ్యారని, ఆ చర్చల ఆధారంగానే అమెరికాలో ఆయిల్ హక్కులు పొందడం, అమెరికా ఆయిల్ కంపెనీతో సంబంధాలు పెట్టుకోవడం గురించి సలహా అడిగానని సదరు రహస్య వ్యక్తి వెల్లడించారు.

Power Politics: తమిళనాడులో అమిత్ షా అడుగుపెట్టగానే కరెంట్ పోయింది. డీఎంకే కావాలనే చేసిందా?

ఇక బోర్డులో హంటర్ బైడెన్ పాత్ర గురించి ఆ అధికారి చర్చించారని, ఆ సందర్భంలోనే బురిస్మా అధికారి 50 వేల డాలర్లు చెల్లించినట్లు వెల్లడించారు. అయితే దీన్ని ఆయన తర్వాత సవరించి అది 50 వేల డాలర్లు కాదని, ఐదు మిలియన్ డాలర్లని పేర్కొన్నారు. జో బిడెన్, హంటర్ బిడెన్ ఇద్దరికీ $5 మిలియన్ల చెల్లింపులు జరిగాయని బురిస్మా ఎగ్జిక్యూటివ్ కాన్ఫిడెన్షియల్ హ్యూమన్ సోర్స్‌కి చెప్పినట్లు ఆరోపణలు తీవ్రమయ్యాయి. “ది బిగ్ గై” డాక్యూమెంట్ గురించి కూడా ప్రస్తావించారు. పేరు బహిరంగంగా వెల్లడించకపోయినప్పటికీ ఇది గురించేనని నివేదిక ఆరోపించింది.