Harmanpreet Kaur : భార‌త కెప్టెన్‌కు ఐసీసీ షాక్‌.. రెండు మ్యాచుల నిషేదం.. ఎందుకంటే..?

భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్( ICC) గ‌ట్టి షాక్ ఇచ్చింది. ఆమె పై రెండు మ్యాచుల నిషేదాన్ని విధించింది.

Harmanpreet Kaur : భార‌త కెప్టెన్‌కు ఐసీసీ షాక్‌.. రెండు మ్యాచుల నిషేదం.. ఎందుకంటే..?

Harmanpreet Kaur

Harmanpreet Kaur two match suspension : భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్( ICC) గ‌ట్టి షాక్ ఇచ్చింది. ఆమె పై రెండు మ్యాచుల నిషేదాన్ని విధించింది. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన కార‌ణంగానే ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు ఐసీసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఐసీసీ వుమెన్స్‌ చాంపియన్‌షిప్‌ సిరీస్‌లో భాగంగా శ‌నివారం ఢాకా వేదిక‌గా బంగ్లాదేశ్‌(Bangladesh)తో మూడో వ‌న్డే మ్యాచ్‌ సందర్భంగా హర్మన్ ప్రీత్ కౌర్ అంపైర్ నిర్ణ‌యాన్ని తప్పుబ‌డుతూ అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసింది. త‌న ఔట్ విష‌యంలో అంపైర్ త‌ప్పుడు నిర్ణ‌యం తీసుకున్నార‌ని బావించి వికెట్ల‌ను త‌న బ్యాట్‌తో బ‌లంగా కొట్టింది. అంతేకాకుండా మైదానాన్ని వీడే స‌మ‌యంలో అంపైర్ల తిడుతూ వెళ్లిపోయింది.

Asian Games 2023 : అమ్మ ప్రేమ‌.. పిల్ల‌ల‌ను తీసుకురావొద్ద‌న్నందుకు.. ఆసియా గేమ్స్ నుంచి త‌ప్పుకున్న క్రికెట‌ర్‌

బ్యాట్‌తో వికెట్ల‌ను కొట్టినందుకు ఇప్ప‌టికే మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించ‌డంతో పాటు డిసిప్లిన‌రీ రికార్డులో 3 డిమెరిట్ పాయింట్లు చేర్చిన సంగ‌తి తెలిసిందే. ఇక అంపైర్ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించినందుకు, మ్యాచ్ ముగిసిన త‌రువాత బ‌హిరంగంగా అంపైర్‌ను విమ‌ర్శించినందుకు గాను హ‌ర్మ‌న్ మ్యాచ్ ఫీజులో మ‌రో 25 శాతం కోత విధించడంతో పాటు ఓ డిమెరిట్ పాయింట్ ఇచ్చింది.

ఓ ఏడాది కాలంలో ఓ ప్లేయ‌ర్ ఖాతాలో నాలుగు డీమెరిట్ పాయింట్లు చేరితే నిబంధ‌న‌ల ప్ర‌కారం ఓ టెస్టు లేదా రెండు ప‌రిమిత ఓవ‌ర్ల మ్యాచ్‌ల‌కు దూరం కావాల్సి ఉంది. హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ఖాతాలో 4 డీమెరిట్ పాయింట్లు చేర‌డంతో ఆమె రెండు మ్యాచ్‌ల‌కు దూరం కానుంది. ఈ నేప‌థ్యంలో ఆమె చైనా వేదిక‌గా జ‌రిగే ఆసియా క్రీడ‌ల్లో తొలి రెండు మ్యాచ్‌ల‌కు దూరం కావాల్సి ఉంటుంది. కాగా.. హ‌ర్మ‌న్‌పై నిషేదాన్ని కొంద‌రు స్వాగ‌తిస్తుండ‌గా మ‌రికొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. త‌ప్పులు చేసిన అంపైర్ల‌పై చ‌ర్య‌లు ఉండ‌వా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Ajinkya Rahane : విండీస్‌తో టెస్టు సిరీస్‌లో విఫ‌ల‌మైన ర‌హానే.. పుజారా గ‌తే ప‌డుతుందా..?