Andhra Praedesh : ఫేస్ బుక్ కలిపింది ఇద్దరిని .. చిత్తూరు యువకుడిని పెళ్లాడిన శ్రీలంక యువతి

సోషల్ మీడియా కలిపింది వారిద్దరిని. ప్రియుడి కోసం దేశమే కాదు సముద్రాన్ని దాటి వచ్చింది. ప్రియుడ్ని వెదుక్కుంటు వచ్చిన ప్రియురాలు తన ప్రేమను దక్కించుకుంది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన వారిద్దరు మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. శ్రీలంక అమ్మాయి..పీ అబ్బాయికి ఒక్కటయ్యారు.

Andhra Praedesh : ఫేస్ బుక్ కలిపింది ఇద్దరిని .. చిత్తూరు యువకుడిని పెళ్లాడిన శ్రీలంక యువతి

Facebook lovers

Facebook lovers : సోషల్ మీడియా(Social media)…ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేస్తోంది. ప్రపంచంలో ఎక్కడెక్కడివారిలో సోషల్ మీడియా కలిపేస్తోంది. దీనికి దేశ సరిహద్దులు..సముద్రాలు అనే ఎల్లలు లేవు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు ప్రేమలుగా మారుతున్న వైనాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశ సరిహద్దులే కాదు సముద్రాలు కూడా దాటేసి ప్రేమికులను కలుస్తున్నారు. వివాహాలు చేసుకుంటున్నారు. పబ్జీ గేమ్‌లో పరిచయమైన భారత్ యువకుడి కోసం పాకిస్థాన్ వివాహిత ఏకంగా తన పిల్లలతో సహా భారత్‌ వచ్చేసింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకుంది. అలాగే బంగ్లాదేశ్ యువతి యూపీ యువకుడి వివాహం చేసుకుంది.ఒ చైనా అమ్మాయి పాక్ వెళ్లింది ప్రేమ కోసం. భారత్ మహిళ పాక్ వెళ్లింది తన సోషల్ మీడియా ప్రియుడ్ని కలుసుకోవటానికి వెళ్లి పెళ్లి కూడా చేసుకుంది. ఇలా చెప్పుకుంటు పోతే ప్రేమల కోసం ఎల్లలు దాటుతున్నారు. తాజాగా శ్రీలంక అమ్మాయి చిత్తూరు వచ్చి ఫేస్‌బుక్ ప్రియుడిని పెళ్లాడింది.

Anju-Nasrullah love story : అంజూ-నస్రుల్లా ప్రేమకథలో బిగ్ ట్విస్ట్…అంజూకు పాక్ పౌరసత్వం

శ్రీలంక(sri lanka )కు చెందిన విఘ్నేశ్వరి(Vigneshwari)కి చిత్తూరు జిల్లా వి.కోట మండలంలోని అరిమాకులపల్లె(Arimakulapalle)కు చెందిన లక్ష్మణ్‌ (Laxman)అనే వ్యక్తితో ఆమెకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. అదికాస్తా ప్రేమ దారితీసింది. అతడిని పెళ్లి చేసుకోవాలని భావించిన విఘ్నేశ్వరి 20 రోజుల క్రితం లక్ష్మణ్ కోసం దేశ సరిహద్దులు దాటి.. సముద్రం దాటి అరిమాకులపల్లె వచ్చింది. ఎక్కడ శ్రీలంక..? ఎక్కడ అరిమాకుల పల్లి..? కానీ ఈ యువతి సాహసం వెనుక ఉన్నది ప్రేమ. వారి ప్రేమ విషయం తెలిసిన పెద్దలు 15 రోజుల క్రితం ఓదేవాలయంలో వారిద్దరికి వివాహం చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది.

Indo-Pak couples love stories : భారత్-పాక్ జంటల ప్రేమ కథల్లో ట్విస్ట్…సీమా హైదర్, అంజూల ప్రేమ బాగోతాలు

వీరి వివాహం విషయం కాస్తా పోలీసులకు చేరింది. శ్రీలంకకు చెందిన యువతి చిత్తూరు యవకుడిని పెళ్లి చేసుకుందనే వార్తలు విన్న పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే అరిమాకులపల్లికి వచ్చారు. విషయం గురించి ఆరా తీశారు. ఆమె పాస్ పోర్టు, వీసా అన్నీ చెక్ చేశారు. వీసా గడువు ఎప్పటి వరకు ఉందో తెలుసుకున్నారు. వీసా గడువు ఆంటపోగ 6 వరకు ఉందని గుర్తించారు. గడువు ముగిసాక శ్రీలంక వెళ్లిపోవాలని నోటీసులిచ్చారు. యువతిని రిజిస్టర్ వివాహం చేసుకుని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించాలని యువకుడి తల్లిదండ్రులను కోరారు. కానీ తన భర్తతోనే ఉంటానంటోంది శ్రీలంక యువతి విఘ్నేశ్వరి.