Heart Emoji : అక్కడంతే..వాట్సాప్ లో హార్ట్ ఎమోజీ పంపితే రూ.20 లక్షల జరిమానా, జైలుశిక్ష కూడా

మీరు సౌదీలో ఉన్నారా..? లేదా సౌదీ వెళుతున్నారా..? మీరు వాట్సాప్ యూజ్ చేస్తుంటే మీరు సెండ్ చేసే ఎమోజీలతో జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా హార్ట్ ఎమోజీ సెండ్ చేసే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే.లేదంటే తప్పదు భారీ జరిమానా..

Heart Emoji : అక్కడంతే..వాట్సాప్ లో హార్ట్ ఎమోజీ పంపితే రూ.20 లక్షల జరిమానా, జైలుశిక్ష కూడా

Heart Emoji saudi arabia

Sending Heart Emoji In saudi arabia: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన చట్టాలు చేయటం వాటిని ఏమాత్రం రాజీ పడకుండా అమలు చేయటంతో అరబ్ దేశాల తరువాతే ఏదేశమైనా అనేలా ఉంటాయి అక్కడి చట్టాలు. అక్కడ జీవించాలంటే అక్కడి చట్టాల గురించే కాదు నిబంధనల గురించి తెలుసుకోవాల్సిందే. లేదంటే అడ్డంగా బుక్ అయిపోతాం. చిన్న చిన్న తప్పులకే జైలుశిక్షలు కూడా వేస్తుంది అక్కడి ప్రభుత్వం. మరి ముఖ్యంగా చెప్పాలంటే మహిళలు కచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించి తీరాలి.

అలాగే మనదేశంలోవలె సోషల్ మీడియా పోస్టులు పెట్టే విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. ఆఖరికి ప్రస్తుత ట్రెండ్ ఎమోజీలతో తమ అభిప్రాయాలను..ఫీలింగ్స్ ను తెలిపే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండా తీరాల్సిందే. లేదంటే తప్పదు భారీ మూల్యం..ఇంకా చెప్పాలంటే జైలుశిక్ష కూడా పడొచ్చు.

Hospitals Colors : ఆస్పత్రుల్లో ఆకుపచ్చ, నీలం రంగులనే ఎందుకు వాడతారో తెలుసా..?

మన ఫీలింగ్స్, అభిప్రాయాలను, సంకేతాలను ఎమోజీల రూపంలో పంపించే ట్రెండ్ సౌదీలో సాగదు. ఏదైనా చెప్పాలన్నా, రియాక్ట్‌ అవ్వాలన్నా ఎమోజీలను తెగ వాడేస్తుంటాం. కానీ సౌదీలో అలా కుదరదు. వాట్సాప్ (WhatsApp)లో ఎమెజీల(Emoji)తో అభిప్రాయాలను..ఫీలింగ్స్ ను తెలుపుతుంటాం. అదే ప్రేమను తెలియజేయాలంటే ‘హార్ట్’సింబల్ (Heart Emoji )సెండ్ చేస్తే సరిపోతుంది..దానికి మాటలు పదాలు టైమ్ చేయనవసరంలేదు. హార్ట్‌ ఎమోజీలతో ఇంప్రెస్‌ చేయటం పరిపాటిగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ప్రేమికులకు. కానీ ఆ ‘హార్ట్ ఎమోజీ’ (Heart Emoji )పంపిస్తే భారీ జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సి వస్తుందట… సౌదీ అరేబియాలో..!!

వాట్సాప్‌లో రెడ్‌ హార్ట్‌ ఎమోజీని వాడితే అది వేధింపులతో సమానమని సౌదీ అరేబియా ప్రభుత్వం తాజాగా కఠిన నిర్ణయం తీసుకుంది. హార్ట్‌ సింబల్‌ పంపితే రెండేళ్ల వరకు జైలు శిక్ష, సౌదీ కరెన్సీలో 100,000 అంటే భారత కరెన్సీలో రూ.20 లక్షల జరిమానా విధిస్తామంటు ప్రకటించింది. అవతలి వ్యక్తి ఇష్టమైతే కాస్త ఓకే..కానీ ఇష్టం లేకుండా పంపిస్తే మాత్రం తప్పదు జరిమానా…అదే మరోసారి చేస్తే జరిమానా ఇంకా పెరుగుతుంది. ఒక్కోసారి జైలుశిక్ష కూడా పడవచ్చు. అవతలి వ్యక్తి పర్మిషన్ లేకుండా వాట్సాప్ లో రెడ్ హార్ట్ ఎమోజీ పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Tierra Young Allen : పబ్లిక్ ప్లేస్‌లో గట్టిగా అరిచిందని అరెస్ట్ .. రెండు నెలలుగా జైల్లోనే టిక్ టాక్ స్టార్

చేసిందే మరోసారి చేస్తే రూ.20లక్షల జరిమానా కాస్త రూ. 60 లక్షలకు పెరుగుతుంది.అంతేకాదు ఐదేళ్ల శిక్ష విధిస్తామని సౌదీకి చెందిన యాంటీ ఫ్రాడ్‌ అసోసియేషన్‌ (Saudi Arabian Anti-Fraud Association)సభ్యుడు అల్‌ మోతాజ్‌ కుత్బీ (Al Moataz Kutbi)అధికారికంగా వెల్లడించారు.

అసలే కఠినాతి కఠినమైన ఆంక్షలు ఉండే సౌదీ దేశంలో ఇది తాజాగా వచ్చిన మరొకటిగా చేరింది. ఈ కొత్త వార్నింగ్ తో జనాలు ఒళ్లు దగ్గరపెట్టుకోవాల్సిందే. లేదంటే జేబులే కాదు బ్యాంక్ బాలెన్స్ కూడా ఖాళీ అయిపోతుంది. కాగా సోషల్‌ మీడియా వాడకాన్ని మరింత సేఫ్‌గా మార్చేందుకు సౌదీ ప్రభుత్వం ఈ కొత్త రూల్ అని వివరించారు మోతాజ్ కుత్బీ.