AP IAS Officers : ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

AP IAS Officers : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఏపీలో మొత్తం 62 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

AP IAS Officers : ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

62 IAS Officers transferred

Updated On : July 20, 2024 / 10:01 PM IST

AP IAS Officers : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఏపీలో మొత్తం 62 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం (జూలై 20)న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులను జారీ చేశారు. మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌గా సీహెచ్. శ్రీదత్‌ను నియమించింది.

Read Also : TTD EO Syamala Rao : తిరుమలపై ఈవో శ్యామలరావు సంచలన వ్యాఖ్యలు

అంతేకాదు.. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్ ఎం.వి. శేషగిరి, హ్యాండ్లూమ్స్, టెక్స్ట్‌టైల్స్ కమిషనర్‌గా రేఖారాణి, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చేవూరి హరికిరణ్ నియమితులయ్యారు. అలాగే సెర్ప్ సీఈవో గా వీర పాండ్యన్, బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా మల్లికార్జున నియమితులయ్యారు.

కమిషనర్లు ఇలా..!

  • మైనారిటీ, సంక్షేమ శాఖ కమిషనర్‌‌గా సీహెచ్ శ్రీధర్‌
  • స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా ఎంవీ శేషగిరి
  • చేనేత శాఖ కమిషనర్‌గా రేఖారాణి
  • ఆరోగ్య శాఖ డైరెక్టర్‌గా చేవూరి హరికిరణ్‌
  • సెర్ప్‌ సీఈవోగా వీరపాండ్యన్‌ నియామకం
  • బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా మల్లికార్జున
  • సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రసన్న వెంకటేష్‌
  • భూ సర్వే, సెటిల్‌మెంట్ల డైరెక్టర్‌గా శ్రీకేష్‌ బాలాజీరావు
  • పౌర సరఫరాల శాఖ ఎండీగా గిరీషా
  • మార్క్‌ఫెడ్‌ ఎండీగా మంజీర్ జిలాని
  • ఇంటర్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా కృతికా శుక్లా
  • ఏపీసీపీడీసీఎల్ సీఎండీగా రవి సుభాష్‌
  • మెడికల్ సర్వీసెస్ ఎండీగా లక్ష్మీషా
  • మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా వేణుగోపాల్‌రెడ్డి
  • గృహ నిర్మాణ కార్పొరేషన్‌ ఎండీగా రాజాబాబు
  • ఎక్సైజ్‌ అండ్ ప్రొహిబిషన్‌ డైరెక్టర్‌గా నిషాంత్‌కుమార్‌

Read Also : హరీశ్‌ రావును ఒంటరిని చేసేలా పక్కా వ్యూహం.. గులాబీ పార్టీని ఖాళీ చేసే లక్ష్యంతో కాంగ్రెస్‌ పావులు?