IAS Officers : తెలంగాణలో 6 ఐఏఎస్ అధికారుల బదిలీలు

IAS Officers : తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ ప్రకియ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో 6 ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.

IAS Officers : తెలంగాణలో 6 ఐఏఎస్ అధికారుల బదిలీలు

Six IAS Officers transferred in telangana State ( Image Source : Google )

Updated On : July 20, 2024 / 11:08 PM IST

IAS Officers : తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ ప్రకియ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో 6 ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం (జూలై 20న) రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఎ శరత్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రవాణా, హౌసింగ్ శాఖ, సాధారణ పరిపాలన శాఖ (స్మార్ట్ గవర్నెన్స్) స్పెషల్ కార్యదర్శిగా వికాస్ రాజ్ నియమితులయ్యారు.

జేఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా మహేశ్ దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొర్ర లక్ష్మి నియమితులయ్యారు. విపత్తు నిర్వహణ స్పెషల్ సెక్రటరీగా హరీశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

హనుమకొండ స్థానిక సంస్థల అదనపు కమిషనర్ రాధిక గుప్తా.. మేడ్చల్‌ మల్కాజిగిరి అదనపు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.

Read Also : AP IAS Officers : ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు