Melania Trump : ట్రంప్‌పై హత్యాయత్నం.. బుల్లెట్ దాడి చూడగానే గుండె ఆగినంత పనైంది.. మెలానియా ట్రంప్ రియాక్షన్..!

Melania Trump : డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడిపై స్పందించిన ఆయన సతీమణి, మాజీ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా అమెరికన్లు తమ రాజకీయ విభేదాలను పక్కనపెట్టాలని ఆమె కోరారు.  

Melania Trump : ట్రంప్‌పై హత్యాయత్నం.. బుల్లెట్ దాడి చూడగానే గుండె ఆగినంత పనైంది.. మెలానియా ట్రంప్ రియాక్షన్..!

Donald Trump's wife Melania reacts to shooting ( Image Source : Google )

Updated On : July 14, 2024 / 11:13 PM IST

Melania Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్యాన్ని ఆయన సతీమణి మెలానియా ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ట్రంప్‌పై కాల్పులు జరిపిన వ్యక్తిని ఆమె రాక్షసుడు అంటూ మండిపడ్డారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ అమానవీయ రాజకీయ యంత్రంగా భావించిన రాక్షసుడు విచక్షణ లేకుండా కాల్పులకు తెగబడ్డాడని మెలానియా ట్రంప్ (X) వేదికగా షేర్ చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ట్రంప్‌పై జరిగిన దాడిపై స్పందించిన మాజీ ప్రథమ మహిళ.. అమెరికన్లు తమ రాజకీయ విభేదాలను పక్కనపెట్టి తమ నాయకులను కుటుంబాలతో కూడిన మనుషులుగా పరిగణించాలని కోరారు.

Read Also : Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్‌షాక్‌..

నా భర్తను రక్షించినందుకు కృతజ్ఞతలు :
తన భర్తను రక్షించినందుకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, లా ఎన్ ఫోర్స్‌మెంట్ అధికారులకు మెలానియా కృతజ్ఞతలు తెలిపారు. “నా భర్త డొనాల్డ్‌పై హింసాత్మక బుల్లెట్ దాడిని నేను చూసినప్పుడు.. నా జీవితం, బ్యారన్ ట్రంప్ వినాశకరమైన మార్పు అంచున చేరిందని భావించాను. నా భర్తను రక్షించడానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ధైర్యవంతులైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు నేను రుణపడి ఉంటాను’’ అని మెలానియా ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్ చెవికి తగిలిన బుల్లెట్ :
2021లో శ్వేతసౌధాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కువగా ప్రజలకు దూరంగా ఉన్న మెలానియా ట్రంప్.. విద్వేషం, దౌర్జన్యం, హింసను రేకెత్తించే ఆలోచనల కన్నా పైకి ఎదగాలని అమెరికన్లను కోరారు. బట్లర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో జరిగిన హత్యాయత్నంలో ట్రంప్ చెవికి బుల్లెట్ తగిలిన సంగతి తెలిసిందే. ఈ వారం చివరిలో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ జరగనున్న విస్కాన్సిన్‌లో మాట్లాడటానికి తాను ఎదురుచూస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

కాల్పులు జరిపిన దుండగుడు హతం :
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) పెన్సిల్వేనియాకు చెందిన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌ హత్యాయత్నానికి పాల్పడినట్టుగా గుర్తించారు. స్టేజీ నుంచి 140 మీటర్ల దూరంలో ఉన్న భవనం పైకప్పు నుంచి కాల్పులు జరిపిన వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆ దుండగుడిని కాల్చి చంపారు. ర్యాలీకి హాజరైన మరో వ్యక్తి మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని సీక్రెట్ సర్వీస్ తెలిపింది.

Read Also : Donald Trump Video : బుల్లెట్ దూసుకువస్తుండగా.. పక్కకు తల తిప్పిన ట్రంప్.. వీడియో వైరల్!