Donald Trump Video : బుల్లెట్ దూసుకువస్తుండగా.. పక్కకు తల తిప్పిన ట్రంప్.. వీడియో వైరల్!

Donald Trump Video : బుల్లెట్ అత్యంత వేగంగా దూసుకువస్తున్న సమయంలో ట్రంప్ తన తలను పక్కకు తిప్పడంతో ప్రాణాపాయం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Donald Trump Video : బుల్లెట్ దూసుకువస్తుండగా.. పక్కకు తల తిప్పిన ట్రంప్.. వీడియో వైరల్!

Video _ How A Head Tilt Helped Trump Dodge The Bullet During Campaign Rally ( Image Source : Google )

Updated On : July 14, 2024 / 10:24 PM IST

Donald Trump Video : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తృటిలో బుల్లెట్ నుంచి తప్పించుకున్నాడు. 78 ఏళ్ల ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో శనివారం ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో బుల్లెట్‌లలో ఒకటి ట్రంప్ చెవిని తాకింది. కాల్పులు జరిగిన కొద్ది క్షణాల తర్వాత ట్రంప్‌ తన సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు ప్రొటెక్ట్ చేశారు. అయితే, కాల్పులు జరిపిన సమయంలో ట్రంప్ ముఖ కదలికలే ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడేశాయి.

Read Also : Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం.. వీడియో వైరల్

బుల్లెట్ అత్యంత వేగంగా దూసుకువస్తున్న సమయంలో ట్రంప్ తన తలను పక్కకు తిప్పడంతో ప్రాణాపాయం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మోషన్ వీడియోలో ట్రంప్‌ తలను వంచడం ద్వారా ఆయన్ను హత్యాయత్నం నుంచి ఎలా కాపాడిందో చూడవచ్చు. బుల్లెట్ తగలడానికి కొన్ని సెకన్ల ముందు ట్రంప్ తన తలను వంచుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.

మరో వీడియోలో స్టేజీ వెనుక నుంచి తీసిన మరో వీడియో వైరల్ అవుతుంది. స్టేజీ వెనక నిలిచిన ఇద్దరు పర్సనల్ గన్‌మెన్‌లు ట్రంప్‌ను రక్షించేందుకు వెళ్లినట్టుగా వీడియోలో చూడవచ్చు. ఆ సమయంలో ట్రంప్ తన కుడి చెవిని పట్టుకొని పోడియంపై పడిపోగా.. ఆయన ముఖం అంతా రక్తంతో నిండిపోయింది. వెంటనే ట్రంప్ తన కుడి పిడికిలిని బిగించి ఫైట్‌.. ఫైట్‌.. ఫైట్‌ అంటూ నినాదాలు చేయడం వీడియోలో కనిపించింది. ఈ కాల్పుల ఘటనలో ర్యాలీకి హాజరైన ఒక వ్యక్తి మరణించగా, మరో ఇద్దరు ప్రేక్షకులు తీవ్రంగా గాయపడ్డారని సీక్రెట్ సర్వీస్ తెలిపింది.

ఈ దాడితో రిపబ్లికన్ అభ్యర్థికి అందించిన భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ ఏడాదిలో అమెరికా అధ్యక్ష పోటీని మార్చే అవకాశం ఉంది. ట్రంప్ సీక్రెట్ సర్వీస్ రక్షణలో బట్లర్ ప్రాంతాన్ని విడిచిపెట్టి, న్యూజెర్సీలోని బెడ్‌మిన్‌స్టర్‌లోని తన గోల్ఫ్ క్లబ్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం ట్రంప్ సురక్షితంగానే ఉన్నారని, ఆయన కుడి ఎగువ చెవిపై గాయంతో పాటు పెద్ద గాయం లేదని ట్రంప్ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌కు ట్రంప్‌పై హత్యాయత్నంతో ప్రమేయం ఉందనే విషయాన్ని ఎఫ్‌బీఐ గుర్తించింది. రాష్ట్ర ఓటరు రికార్డుల ప్రకారం.. అతను రిజిస్టర్డ్ రిపబ్లికన్. ట్రంప్ మాట్లాడుతున్న వేదికకు 140 మీటర్ల దూరంలో ఉన్న భవనం పైకప్పుపై నుంచి కాల్పులు జరపడంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతడిని కాల్చిచంపారు.

అతని మృతదేహం దగ్గర AR-15 తరహా సెమీ ఆటోమేటిక్ రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. 1981లో రిపబ్లికన్ ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్‌పై హత్యాయత్నానికి ప్రయత్నించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు లేదా ప్రధాన పార్టీ అభ్యర్థిపై కాల్పులు జరపడం ఇదే తొలిసారి. నవంబర్ 5 ఎన్నికలకు నాలుగు నెలల ముందు, డెమొక్రాటిక్ అధ్యక్షుడు జో బిడెన్‌తో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కాల్పులు జరిగాయి.

Read Also : Donald Trump : డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటన.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..